E-Paper
Advertisement

ఇదేం తల్లి ప్రేమరా బాబూ… కొడుకు గెలుపు కోసం పాపనే లేపేసే ప్లాన్… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ థ్రిల్లర్

ఇదేం తల్లి ప్రేమరా బాబూ… కొడుకు గెలుపు కోసం పాపనే లేపేసే ప్లాన్… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ థ్రిల్లర్
Advertisement

Gelupu OTT: పిల్లలు గెలిస్తే తల్లిదండ్రులకు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. కానీ తమ పిల్లలు ఎప్పుడూ గెలవాలనే మొండిపట్టుదల ఉంటే? ఎదుటివాళ్ల ప్రతిభను కూడా ఓర్చుకోలేకపోతే? చివరికి తమ కొడుకు విజయం కోసం ఓ చిన్నారి ప్రాణాలనే తీయాలనుకుంటే? వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన తెలుగు స్పోర్ట్స్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గెలుపు’. బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ కథలోని అసలు ట్విస్ట్ ఏంటో  తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

పురుషోత్తం చిన్న వయసులోనే చెస్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తూ ఛాంపియన్‌గా ఎదుగుతుంటాడు. అతడి తల్లి (ఇనయా సుల్తానా)కు మాత్రం కొడుకు ఎప్పుడూ గెలవడమే ముఖ్యం. ఓటమి అనే మాటే అతడి జీవితంలో ఉండకూడదని భావిస్తుంది. తల్లి ఇచ్చే అతిగా ప్రోత్సాహం, గెలుపుపై పెంచే మోజుతో పురుషోత్తంలోనూ గర్వం పెరిగిపోతుంది. తనను ఓడించే వాళ్లే లేరన్న ధీమాతో ఉంటాడు.

Advertisement

అయితే అదే సమయంలో ఓ పేదింటి చిన్నారి చెస్‌లో తన తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పెద్ద పెద్ద ఆటగాళ్లను సైతం ఓడిస్తూ దూసుకెళ్తుంది. ఓ సందర్భంలో పురుషోత్తాన్ని కూడా ఓడించడంతో అతడి తల్లికి కోపం కట్టలు తెంచుకుంటుంది. తన కొడుకు ఓటమిని అంగీకరించలేని ఆమె.. ఆ చిన్నారి భవిష్యత్తులోనూ అతడికి పోటీగా మారుతుందని భావిస్తుంది. అందుకే ఆ పాపను అడ్డు తొలగించుకోవాలని దారుణమైన నిర్ణయం తీసుకుంటుంది.

ఒక ఆటలో గెలుపు కోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధపడిన ఆ తల్లి.. చివరికి ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? ఆ చిన్నారి ప్రాణాలకు వచ్చిన ముప్పు నుంచి ఎలా బయటపడింది? గెలుపు అంటే ప్రత్యర్థిని ఓడించడమేనా, లేక ప్రతిభను గుర్తించడమా? అన్నదే ఈ సినిమా మిగతా కథ.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే ?

Advertisement

ఈ సినిమాలో ఇనయా సుల్తానా, చైత్ర పెద్ది, అశ్విని, మహీధర్, అన్విష తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రవీణ్ రామరాజు దర్శకత్వం వహించగా, బొమ్మదేవర నాగకుమారి కథను అందించారు. ‘కథా సుధా’ పేరుతో ETV Win పరిచయం చేస్తున్న కథల్లో భాగంగా రూపొందిన ఈ చిన్న సినిమా 2026 నవంబర్ 15 నుంచి ETV Win ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. చెస్ ఆట నేపథ్యంలో తల్లిదండ్రుల అతిప్రేమ, గెలుపుపై ఉండే వ్యామోహం, పిల్లల మనస్తత్వాలను చూపించే ఈ ఎమోషనల్ థ్రిల్లర్‌ను ఇప్పుడు ఇంట్లోనే చూసేయొచ్చు.

Read Also: 20 ఏళ్లుగా కనిపించని స్టార్ సింగర్.. మేనకోడలి కోసం రంగంలోకి.. ట్రెండింగ్ లో మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ప్రేమ జంటకు విలన్‌గా మారిన ఎమ్మెల్యే.. అప్పులు చేసి కొన్న ఇంటి కోసం ప్రాణాలతో చెలగాటం.. ఓటీటీలోకి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్

బోర్ కొడుతోందా? అయితే ఈ ‘వైబ్’ ట్రై చేయండి… యూత్‌ని కట్టిపడేస్తున్న స్పై కామెడీ థ్రిల్లర్

ఓరి దేవుడో… ఆపదొస్తే ఆ దేవుడేం చేశాడో తెలుసా ? గుండెల్ని పిండేసే ఈ క్రిస్మస్ మాస్టర్‌పీస్‌ని ఇప్పుడే చూసేయండి

టార్చర్ పెట్టిన బాస్‌నే పెళ్లి చేసుకునే అసిస్టెంట్‌.. ఓటీటీలోకి నవ్వులు పూయించే రొమాంటిక్ కామెడీ

8,000 ఏళ్లుగా చావు లేకుండా బతుకుతున్న వ్యక్తి… రైలు ప్రయాణంలో బయటపడ్డ వింత ప్రేమకథ.. ఈ సినిమా ఓటీటీ ఎక్కడంటే?

సినిమా చరిత్రపై కడుపుబ్బా నవ్వించే సెటైర్లు… ఓటీటీలోకి నవ్వుల పటాకా… మూవీ లవర్స్ డోంట్ మిస్

పెళ్లైన మొదటి రాత్రే షాకింగ్ ట్విస్ట్… కుడివైపు ఉండాల్సిన గుండె ఎడమవైపుకు మారితే? ఓటీటీలోకి క్రేజీ మెడికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×