Best Action Movies on OTT : థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుని, ఓటిటి ప్లాట్ ఫామ్ లో సినిమాలను చూసి చిల్ అవుతున్నారు మూవీ లవర్స్. సస్పెన్స్ తో కూడిన యాక్షన్ సినిమాలను చూడాలనుకునే మూవీ లవర్స్ కోసం, ఇప్పుడు కొన్ని బెస్ట్ సినిమాలు గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలను వీకెండ్ లో, సమయం ఉన్నప్పుడు మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయండి.
వ్రాత్ ఆఫ్ మ్యాన్ (Warth of man)
2021 లో వచ్చిన ఈ వ్రాత్ ఆఫ్ మ్యాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీకి గై రిచీ దర్శకత్వం వహించారు. ప్రధాన నటుడు జాసన్ స్టాథమ్‌తో, రిచీ వరుసగా దర్శకత్వం వహించిన నాలుగో మూవీ వ్రాత్ ఆఫ్ మ్యాన్. హోల్ట్ మెక్‌కాలనీ, జెఫ్రీ డోనోవన్, క్రిస్ రీల్లీ, జోష్ హార్ట్‌నెట్, లాజ్ అలోన్సో, రౌల్ కాస్టిల్లో, డియోబియా ఒపారీ, ఎడ్డీ మార్సన్మ ఈ మూవీలో నటించారు. ఇందులో హీరో లాస్ ఏంజిల్స్‌లో కొత్త క్యాష్ ట్రక్ డ్రైవర్ గా డ్యూటి చేస్తాడు. అతడు దోపిడీని అడ్డుకోవడం, తుపాకీలకు పనిచెప్పడంతో, అక్కడ ఉన్నవాళ్ళు రహస్యమైన హీరో గతాన్ని తెలుసుకవాలనుకుంటారు. వ్రాత్ ఆఫ్ మ్యాన్ ఏప్రిల్ 22, 2021న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుని, ప్రపంచవ్యాప్తంగా $104 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
క్యారీ ఆన్ (Carry on)
2024లో విడుదలైన ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి జౌమ్ కొలెట్ సెర్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో టారోన్ ఎగర్టన్, సోఫియా కార్సన్, డేనియల్ డెడ్‌వైలర్, జాసన్ బాట్‌మాన్ నటించారు. హీరో క్రిస్మస్ ఈవ్ సమయంలో విమానంలోకి, ఒక ఏజెంట్‌ను అనుమతించేలా బ్లాక్ మెయిల్ చేయబడతాడు. ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించడంతో హీరో ఆపని చేస్తాడు. ఆతరువాత జరిగే యాక్షన్ సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.
రైఫిల్ క్లబ్ (Rifle Club)
2024 లో వచ్చిన ఈ మలయాళ యాక్షన్ కామెడీ మూవీకి ఆషిక్ అబు దర్శకత్వం వాహయిచ్చారు. OPM సినిమాస్, TRU స్టోరీస్ బ్యానర్లపై ఆషిక్ అబు, విన్సెంట్ వడక్కన్, విశాల్ విన్సెంట్ టోనీ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీలో విజయరాఘవన్, దిలీష్ పోతన్, అనురాగ్ కశ్యప్, వాణీ విశ్వనాథ్, సురేష్ కృష్ణ, వినీత్ కుమార్ మరియు సురభి లక్ష్మి నటించారు. ఇద్దరు వ్యక్తులు తమ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఒక రైఫిల్ క్లబ్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనే విషయాలు చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ముండకాయం, రాజమండ్రి అడవులు, త్రిసూర్, ఎర్నాకులంలో షూటింగ్ జరిగింది. ఈ మూవీ 19 డిసెంబర్ 2024న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొంది, బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌గా విజయం సాధించింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.