Anil Ravipudi : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి ఒకసారి సక్సెస్ పలకరించింది కదా అని సైలెంట్ అయితే ఇక ఆ తర్వాత సక్సెస్ అనే మాటకు దూరమవ్వాలి. హీరోల కన్నా ముందు డైరెక్టర్లకే సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో వాళ్ళు తీసిన ట్రాక్టర్ ని బట్టి హీరోలు వాళ్లతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తారు.. సినిమా అయినా అందరికీ నచ్చుతుందని చెప్పలేం. కానీ కొన్ని చిత్రాలు మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి.. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా వసూళ్ల పైనే సినిమా హిట్ ఆధారపడి ఉంటుందని నమ్మే వ్యక్తి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ ఇండస్ట్రీ లోకి అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చి సరిగ్గా నేటికీ పదేళ్లు పూర్తయింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలేంటి? ట్రాక్ రికార్డు ఏంటి? ఏం సాధించాడో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అనిల్ రావిపూడి సినిమాలు..
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తయ్యింది.. డైరెక్టర్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవవ్వరూ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి వెంకీ మామతో వరుసగా మూడు సినిమాలను చేశాడు. ఎఫ్ 2, ఎఫ్ 3 అలాగే రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. దర్శకత్వంలో ఆయన బాగా తృప్తి చెంది.. ఆడియన్స్ తన సినిమాలను ఇక చాలు అని ఫీలయ్యే వరకు సినిమాలకు దర్శకత్వం వహిస్తానని.. ఆ తర్వాత నటనలోకి దిగి నటుడిగా మారిపోతానంటూ చెప్పుకొచ్చాడు. ప్రేక్షకుల తన సినిమాలను ఆదరిస్తున్నంతవరకు దర్శకుడిగా మరిన్ని చిత్రాలను తెరకెక్కిస్తానన్నాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. పదేళ్లలో వరుస హిట్ సినిమాలను తెరకేక్కించడం ఆయన మాత్రమే దక్కిన రికార్డు అని తెలుగు సినీ అభిమానులు అంటున్నారు.. రీసెంట్ గా వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ తో మరో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు.
పదేళ్లలో ఓ స్కూల్..
తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస హిట్ సినిమాలతో బాగానే సంపాదించాడు.. సినిమాల్లో సంపాదించిన డబ్బులతో ఆయన బాగానే పాపర్టీ లను కొనుగోలు చేశాడు. హైదరాబాద్ సిటీ ఔట్స్కస్లో కొన్ని ఎకరాలు ల్యాండ్ కొన్నారని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 10 – 15 ఎకరాలు కొనుగోలు చేశారని టాక్.. ఆ ల్యాండ్ లో అనిల్ రావిపూడి స్కూల్స్ అని స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఆ స్కూల్స్ గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. మరి చూడాలి.. స్కూల్స్ స్టార్ట్ చేస్తాడో లేక ఇంకేదైనా బిజినెస్ మొదలు పెడతారేమో.. ఇక అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే మరో సినిమాను ప్రకటించనున్నారని సమాచారం..