BigTV English
Advertisement

OTT Movie : జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే

OTT Movie : జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే

OTT Movie : మలయాళం సినిమాలు ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, కథలతో వస్తున్నాయి. వీటిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. దృశ్యం సినిమా నుంచి మొదలైన ఈ సందడి కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మనం జి ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మలయాళం సినిమాల గురించి తెలుసుకుందాం.


పకలుం పతిరవుం (Pakalam pathivuram)

2023లో విడుదలైన ఈ  మలయాళ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి, అజై వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఇందులో కుంచాకో బోబన్, రజిషా విజయన్, గురు సోమసుందరం, ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2018లో వచ్చిన కన్నడ చిత్రం ‘ఆ కరాలా రాత్రి’కి రీమేక్ గా వచ్చింది. ఈ మూవీ 3 మార్చి 2023న థియేటర్‌లలో విడుదలైంది. ఇది 28 ఏప్రిల్ 2023 నుండి  ZEE5లో అందుబాటులోకి వచ్చింది.


ఐడెంటిటీ (Identity)

2025లో విడుదలైన ఈ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్‌ థ్రిల్లర్ మూవీని రాగం మూవీస్, కాన్ఫిడెంట్ గ్రూప్ బ్యానర్‌పై రాజు మల్లియత్, రాయ్ సీ. జే నిర్మించారు. ఈ సినిమాకు అఖిల్ పాల్, అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జనవరి 2న మలయాళంలో విడుదల చేయగా, మాక్స్‌ శ్రీనివాస్‌ మామిడాల సమర్పణలో వేదాక్షర చింతపల్లి రామారావు తెలుగులో జనవరి 24న విడుదలన విడుదల చేశారు.

ఇని ఉత్తరం (Ini utharam)

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుధీష్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. రంజిత్ ఉన్ని రచించిన ఈ  మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో అపర్ణ బాలమురళి, కళాభవన్ షాజోన్, హరీష్ ఉత్తమన్, సిద్ధిక్ తదితరులు నటించారు. “ఇని ఉత్తరం” అక్టోబర్ 7, 2022న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది.

కాలా (Kala)

2021 లో వచ్చిన ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రోహిత్ V. S. దర్శకత్వం వహించారు. దీనిని యదు పుష్పకరణ్, రోహిత్ V. S రచించారు. ఇందులో మూర్, టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. లాల్, దివ్య పిళ్లై సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చమన్ చక్కో ఎడిటర్ కాగా, అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని జువిస్ ప్రొడక్షన్స్‌పై సిజు మాథ్యూ, నావిస్ జేవియర్ నిర్మించారు.

పాపన్ (Paappan)

2022లో విడుదలైన ఈ  మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీకి జోషి దర్శకత్వం వహించారు. ఈ మూవీని గోకులం గోపాలన్, డేవిడ్ కాచప్పిల్లి, రఫీ మతిర్ర సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తండ్రీ కొడుకులుగా, సురేష్ గోపి, గోకుల్ సురేష్ నటించారు.  నీతా పిళ్లై, ఆశా శరత్, నైలా ఉష, కనిహా, అజ్మల్ అమీర్ సహాయక పాత్రల్లో నటించారు. పాపన్ మూవీ 29 జూలై 2022న విడుదలైంది. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. వాణిజ్యపరంగా  కూడా ఈ మూవీ విజయం సాధించింది. ఈ మూవీ 7 సెప్టెంబర్ 2022 నుండి  ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Big Stories

×