Nagarjuna.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున (Nagarjuna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. “యువ సామ్రాట్”, “కింగ్ నాగార్జున” అనే బిరుదులు కూడా సొంతం చేసుకుంది. కెరియర్ ద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. ఇక నాగార్జున హీరోగానే కాకుండా పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, రెస్టారెంట్స్, కన్స్ట్రక్షన్స్, కన్వెన్షన్స్ వంటి రంగాలలో కూడా మంచి వ్యాపారవేత్తగా పేరు సొంతం చేసుకున్నారు నాగార్జున. అంతేకాదు వేలాది కోట్ల రూపాయలను సంపాదించిన హీరోగా పేరు దక్కించుకున్న ఈయన.. దక్షిణాదిలో అత్యంత ధనవంతుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు.
నాగార్జున అసలు పేరు ఏంటంటే..?
ఇదిలా ఉండగా.. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) , అన్నపూర్ణ (Annapoorna) దంపతులకు నాగార్జున జన్మించారు. అయితే ఈయన జన్మించే సమయంలో నాగార్జున సాగర్ ను నిర్మించారట. ఇక ఈ పేరుని తన కొడుకుకు పెట్టాలని నాగేశ్వరరావు నిర్ణయం తీసుకొని, ‘నాగార్జున సాగర్’ అని నామకరణం చేశారు. ముఖ్యంగా నాగార్జున సినిమాటోగ్రఫీకి వచ్చిన తర్వాత తన పేరు చివర ఉండే సాగర్ అన్న పదాన్ని తీసేసి కేవలం నాగార్జున అనే పేరుతోనే సినిమాలు ప్రారంభించారట. ఇక ఈ పేరు మార్పు నాటకాల వేదికగా రంగస్థలంలో ఆయన ప్రజాధరణ పొందడానికి దోహద పడిందని సమాచారం. ఇకపోతే అలా నాగార్జున గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన, వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. అటు హీరోగానే కాకుండా ఇటు హోస్ట్ గా కూడా చేస్తూ బిగ్ బాస్ వంటి కార్యక్రమాలతో మరింత పాపులారిటీ అందుకున్నారు.
నాగార్జున సినిమా జీవితం..
నాగార్జున సినీ జీవిత విషయానికి వస్తే.. 1961లో “వెలుగు నీడలు”అనే సినిమాతో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగార్జున. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన “సుడిగుండాలు” సినిమాలో కూడా 1967లో బాల నటుడిగా నటించడం జరిగింది. ఈ రెండు సినిమాలలో కూడా ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించడం గమనార్హం. 1986లో వి.మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ‘విక్రం’అనే సినిమా ద్వారా నాగార్జున హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా 1983లో విడుదలైన ‘హీరో’ అనే హిందీ చిత్రానికి రీమేక్. విక్రమ్ సినిమా మంచి విజయం సాధించడంతో నాగార్జునకి కూడా మంచి కెరియర్ మొదలయ్యింది. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘మజ్ను’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత మణిరత్నం(ManiRatnam ) దర్శకత్వంలో ‘గీతాంజలి’ అనే సినిమా చేసి ఉత్తమ ప్రజాధారణ పొందిన చిత్రంగా అప్పట్లోనే నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక తర్వాత ‘శివ’ సినిమాతో తనలోని మరో యాంగిల్ ని చూపించి, అందర్నీ అబ్బురపరిచారు నాగార్జున. తర్వాత నిర్ణయం కిల్లర్, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, హలో బ్రదర్, వారసుడు, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, క్రిమినల్, నిన్నే పెళ్ళాడతా వంటి చిత్రాలు ఈయనకు మంచి విజయాన్ని అందించాయి. అంతేకాదు పలు విభాగాలలో నంది అవార్డులు కూడా అందుకోవడం జరిగింది. మొత్తానికైతే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగార్జున.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Director Shankar: డ్రాగన్ మూవీపై శంకర్ రివ్యూ.. ఏమన్నారో తెలుసా..?