Best Fantasy Movies on OTT : ఫాంటసీ సినిమాలంటే మొదట గుర్తుకొచ్చేది హాలీవుడ్ మూవీస్. కొన్ని సినిమాలు చూసిన రోజునే మర్చిపోతాం. మరి కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుంటాయి. అటువంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండే బెస్ట్ ఫాంటసీ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ (The Lord oftheRings)
ఈ మూవీ ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసి, ఆస్కార్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఇప్పటికీ ఈ సినిమా అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. పీటర్ జాక్సన్ ఈ మూవీ ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ ఫాంటసీ మూవీ ఒక రింగ్ చుట్టూ తిరుగుతుంది. ఆ రింగును నాశనం చేయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. హీరో ఆ ప్రయత్నాలను అడ్డుకుంటాడు. ఆరు భాగాలు వచ్చిన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
హ్యారీ పోట్టర్ (Harry Potter)
ఈ మూవీ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఒక సాధారణ గృహిణి జె.కె. రౌలింగ్ సరదాగా ట్రైన్ జర్నీలో మొదలుపెట్టిన ఈ స్టోరీ గొప్ప సంచలనాలను సృష్టించింది. 1997లో ప్రచురించిన ఈ నవలతో ఆమె సంపన్నుల జాబితాలో చేరింది. ఆమె రాసిన నవల ఆధారంగానే హ్యారీ పోట్టర్ సినిమాను చిత్రీకరించారు. ఈ మూవీకి నలుగురు దర్శకులు క్రిస్ కొలంబస్, అల్ఫోన్సో కూయరోన్, మైక్ నేవేల్, డేవిడ్ యటేశ్ పనిచేశారు. ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీని బెస్ట్ ఫాంటసీ మూవీ గా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలను ఈ మూవీ ఎంతగా ఆ కట్టుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎనిమిది భాగాలుగా వచ్చిన ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.
జుమాంజి (Jumanji)
ఈ అమెరికన్ ఫాంటసీ మూవీకి జేక్ కస్డాన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఒక కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ కు యాజమాన్యం పనిష్‌మెంట్ ఇస్తుంది. వాళ్ళను ఒకచోట క్లీనింగ్ కి పెడతారు. అక్కడ కంప్యూటర్ గేమ్ వీళ్ళకు కనబడుతుంది. ఆ కంప్యూటర్ ద్వారా వీళ్ళు ఆ గేమ్ లో లాక్ అయిపోతారు. గేమ్ కంప్లీట్ అయితే కానీ వీళ్ళు బయటికి రాలేరు. ఈ మూవీ కూడా మూవీ లవర్స్ ను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ ఫాంటసీ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమాలను ఫ్యామిలీతో సహా ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. పిల్లలు ఉంటే మరీ మంచిది. కాసేపు పిల్లలతో కలిసి ఈ మూవీ చూస్తే ఆ ఫీలింగ్ చాలా బెటర్ గా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం మూవీ లవర్స్ ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.