Rahul Gandhi Adani BJP| అదానీ గ్రూప్ కంపెనీల చైర్మన్ కు వ్యతిరేకంగా అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ చేయడంపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. అమెరికాలో అదానీని అరెస్టు చేసేముందే భారత ప్రభుత్వం అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే అదానీ అరెస్ట్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అడ్డుకుంటారని.. అయినా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అదానీని అరెస్టు చేసేంతవరకు పోరాడుతూనే ఉంటాయని గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మండిపడింది. ప్రతీ విషయాన్ని సంచలనంగా చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని.. ఆయనపై ఆరపణలు చేసింది.
Also Read: మంత్రిగారికి మాతృభాష రాదు.. కార్యక్రమంలో అందరిముందు విద్యాశాఖ మంత్రిపై విద్యార్థి వ్యాఖ్యలు
బిజేపీ ఎంపీ సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. “ఈ రోజు రాహుల్ గాంధీ మళ్లీ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మళ్లీ ముందులాగే ప్రవర్తించారు. ఆయన ఇలా చేయడం మాకు కొత్త కాదు. ప్రతి సారి విషయాలను సంచలనం చేసి మాట్లాడుతారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు లాగుతారు. కరోనా సమయంలో కూడా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీకి చౌకీ దార్ చోర్ హై అంటూ నినాదాలు ఇచ్చారు. కానీ చివరికి వారు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అదానీ విషయంలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరుని లాగుతున్నారు. ఇక్కడ ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ బురద చల్లుతుంటే విదేశాల్లో మాత్రం మోడీకి ఘనసన్మానం లభిస్తోంది.
అవినీతి కేసుల్లో విచారణ చేయాలని డిమాండ్ చేయడం మంచిదే. మేము కూడా దేశంలోని అవినీతికి పాల్పడే ముఖ్యమంత్రులపై విచారణ కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో లంచం కేసులు ఉన్నాయి. వాటిపై విచారణ సాగుతోంది. తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం, ఒడిశాలోని బిజేడీ ప్రభుత్వం, ఛత్తీస్ గడ్ లోని మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ లపై అవినీతి కేసుల్లో విచారణ జరుగుతుంది.
ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా బిజేపీ యేతర పార్టీలు ఉన్న ప్రభుత్వాలున్నాయి. అన్నిచోట్ల కాంగ్రెస్ కూటమి పార్టీల ప్రభుత్వాల ఉండడం విశేషం. రాహుల్ గాంధీకి అభ్యంతరం లేకపోతే ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భుపేశ్ భగేల్ పై విచారణ చేసేందుకు మాకు అభ్యంతరం లేదు. ” అని సంబిత్ పాత్ర అన్నారు.
మరోవైపు అదానీ అవినీతిపై మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ నాయకుడు ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. “అదానీ అవినీతి పరుడని తేలిపోయింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ఆయనకు ధారావి లాంటి ప్రాజెక్ట్స్ ఇవ్వలేదనే కక్షతో అదానీ ప్రభుత్వం కూల్చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో వందలు వేల కోట్లు అదానీ ఖర్చు పెట్టారు. ఆయనను అరెస్ట్ చేయాల్సిందే” అని అన్నారు.
అదానీకి అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. “బిజేపీ, అదానీ అవినీతి గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ, అదానీ దేశ పరువుని దిగజార్చారు.” అని మండిపడ్డారు.