Best Horror Movies To Watch on Netflix : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ మారింది. డిజిటల్ మీడియా లో ఓటిటి ప్లాట్ ఫామ్ లు చాలా ఉన్నప్పటికీ, మంచి కంటెంట్ తో ఉన్న సినిమాలను నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ హర్రర్ సినిమాలకు అడ్డగా మారింది. వీటిలో వెన్నులో వణుకు పుట్టించే సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే వీటిని పగలు చూడాలన్న భయపడే కొన్ని బెస్ట్ హర్రర్ సినిమాల గురించి తెలుసుకుందాం.
గ్రేవ్ టార్చర్ (Grave Torture)
2024 లో వచ్చిన ఈ మూవీ సరికొత్త రికార్డును సృష్టించింది. ఇండోనేషియా నుంచి వచ్చిన ఒక సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ గ్రేవ్ టార్చర్. ఫర్దీనా ముఫ్తీ, కృస్టినో హకీం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి జోకో అన్వర్ దర్శకత్వమహించాడు. మరణం తర్వాత విధించబడే శిక్షలతో ఈ మూవీని చిత్రీకరించారు. మరణాన్ని అత్యంత భయంకరంగా చూపించే ఈ మూవీ ఇండోనేషియా బెస్ట్ ఫిల్మ్ గా అవార్డును అందుకుంది. 117 నిమిషాలు నిడివి గల ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హర్రర్ మూవీ 2024 లో వచ్చిన బెస్ట్ మూవీ గా చెప్పుకోవచ్చు.
ఇట్స్ వాట్స్ ఇన్సైడ్ (It’s What’s Inside)
2024లో రిలీజ్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి గ్రేగ్ జార్డిన్ దర్శకత్వం వహించాడు. బ్రిట్నీ ఓ గ్రాడి, జేమ్స్ మెరోసినీ, గావిన్ లెదర్ ఫుడ్ ప్రధాన పాత్రలు పోషించారు. వివాహానికి ముందు జరిగే ఒక పార్టీలో కొంతమంది స్నేహితులు బ్లేమ్ గేమ్ లు ఆడుతూ ప్రమాదాలను అనవసరంగా కొనితెచ్చుకుంటారు. ఈ మూవీలో ట్విస్టులు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. 103 నిమిషాలు నిడివి గల ఈ మూవీ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది పోప్స్ ఎగ్జార్సిస్ట్ (The Pope’s Exorcist)
2023లో వచ్చిన ఈ మూవీకి జూలియస్ అవరి దర్శకత్వం వహించారు. హాలీవుడ్ సూపర్ స్టార్ రషల్ క్రౌ తోపాటు డేనియల్ జోవట్టొ, అలెక్స్, ఫ్రాంకో ప్రధాన పాత్రలు పోషించారు. ఐర్లాండ్లో చిత్రీకరించిన ఈ మూవీ 103 నిమిషాల నిడివితో ప్రదర్శితమై వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
కార్గో (Cargo)
2017 లో రిలీజ్ అయిన ఈ మూవీకి బెన్ హౌలింగ్ దశకత్వం వహించాడు. మార్టిన్ ఫ్రీ మాన, పోటర్, సిమాన్ లాండర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఒక జాంబి సినిమా. తండ్రి తన కుటుంబం తో కలిసి ఒక యాత్రకు వెళ్లాక, అతనికి జాంబీలు ఎదురవుతాయి. వాటిని ఈ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందో తెలిస్తే భయంతో వనికి పోతారు. అత్యంత భయంకరంగా ఉండే ఈ మూవీ 115 నిమిషాలు నిడివి ఉంటుంది. అత్యంత భయంకరమైన సినిమాలలో ఈ మూవీ కూడా చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.