RAPO22: ఉస్తాద్.. ఇస్మార్ట్ శంకర్ అంటూ ప్రేక్షకులకు మాస్ హీరో అంటే ఇలా ఉండాలి అని అనిపించుకున్నాడు రామ్ పోతినేని. ఈ సినిమా రామ్ కు ఏ రేంజ్ హిట్ ను అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత రామ్ ఒక మంచి హిట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రామ్ తన తదుపరి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రకటించిన విషయం తెల్సిందే.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో డైరెక్టర్ గ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు పి.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రాపో 22 గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా.. తాజాగా షూటింగ్ ను మొదలుపెట్టిన్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు రామ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రామ్.. సాగర్ అనే పాత్రలో నటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ” మీ సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్” అని రాసుకొచ్చారు.
BB Telugu 8: అవినాష్ పనికి రోహిణి కంటతడి..!
ఇక సాగర్ గా రామ్ లుక్ అదిరిపోయింది. ఒత్తైన జుట్టు.. మీసాలు లేకుండా క్లీన్ షేవ్ లో చేతిలో బుక్ పట్టుకొని.. కాలేజ్ కుర్రాడిలా రామ్ కనిపించాడు. ఇప్పటివరకు రామ్ ను ఈ లుక్ లో చూసింది లేదనే చెప్పాలి. దీంతో సినిమాపై మొదటి నుంచే అంచనాలను పెంచేసుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా విజయం అందుకోవడం రామ్ కు, భాగ్యశ్రీ కు ముఖ్యమని చెప్పాలి. మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ తెలుగులో అడుగుపెట్టింది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే అమ్మడు వరుస అవకాశాలను అందుకుంది.
మిస్టర్ బచ్చన్ లో అమ్మడి నటన, అందాల ఆరబోత చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఒక్క సినిమా హిట్ కాకముందే.. స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేర్చేశారు. అయితే అన్ని అనుకున్నట్లు అవ్వవు అన్నట్లు.. మిస్టర్ బచ్చన్ భారీ పరాజయాన్ని అందుకుంది. దీంతో భాగ్యశ్రీ ఒక్క సినిమాతోనే వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో తెలుగువారిని పలకరించడానికి రెడీ అవుతుంది. అందుకే ఈ సినిమాపై ఆమె భారీ ఆశలను పెట్టుకుంది. రామ్ ది కూడా సేమ్ పరిస్థితి.
Tollywood: ‘పుష్ప -2’ దెబ్బ.. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు
డబుల్ ఇస్మార్ట్ తరువాత ఈ కుర్ర హీరోకు మంచి హిట్ కావాలి. దానికోసం హిట్ డైరెక్టర్స్ ను లైన్లో పెడుతున్నాడు. డైరెక్ట్ మహేష్ బాబు.. మొదటి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. చాలా సెన్సిటివ్ విషయాన్నీ ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తెరపై చూపించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇప్పుడు రామ్ లుక్ చూస్తుంటే.. ఇది కూడా ఒక డిఫరెంట్ కథలా అనిపిస్తుంది. నేటి నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో రామ్, భాగ్యశ్రీల లక్ మారుతుందా.. ? వారికి భారీ హిట్ పడుతుందా.. ? అనేది చూడాలి.
When you know him, you will see yourself in him.
Meet @ramsayz as 'SAGAR' from #RAPO22 ❤️🔥
He will soon bring an ocean of great cinema moments to the big screens. Shoot begins ✨@bhagyasriiborse @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @sreekar_prasad… pic.twitter.com/MokDBGNggZ
— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024