Best Psycho Thriller movies on OTT : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకి ఓటిటి ప్లాట్ ఫామ్ అడ్డాగా మారుతోంది. వీటిలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నా, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ట్విస్ట్ లతో ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఈ సినిమాలు ఉంటాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలా (Qala)
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 2022లో రిలీజ్ అయింది. త్రిప్తి దిమ్రి, స్వస్తిక ముఖర్జీ, బాబిల్ ఖాన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి అన్విత దత్ దర్శకత్వం వహించారు.ఈ మూవీలో హీరోయిన్ సింగర్ గా ఎదగాలని తపిస్తూ ఉంటుంది. మరోవైపు ఆమె తల్లిపై పోరాడే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ పిరియాడికల్ సైకలాజికల్ డ్రామా చిత్రం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.
సైకో (Psycho)
2020లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఉదయ్ నిధి స్టాలిన్, నిత్యామీనన్, హైదరీ రావు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీకి మిష్కన్ దర్శకత్వం వహించాడు. ఉదయనిది స్టాలిన్ అంధుడి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. హీరోయిన్ ను ఒక వ్యక్తి కిడ్నాప్ చేయడంతో ఆమెను అంధుడు అయిన హరో వెతికే క్రమంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ థ్రిల్లర్ మూవీ మొదటి నుంచి చివరిదాకా కుర్చీలకే కట్టిపడేస్తుంది. ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ (Netflix) ఫ్లిక్స్ లో చూడవచ్చు.
గేమ్ ఓవర్ (Game over)
2019లో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయింది. తాప్సి, వినోదిని వైద్యనాథన్, సంజనా నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి అశ్విన్ శర్వానన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో స్వప్న అనే అమ్మాయి ఒక ప్రమాదకరమైన జబ్బుతో పోరాడుతూ ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ఈ అమ్మాయి ఇంట్లోకి ఒక సైకో కిల్లర్ ప్రవేశిస్తాడు. ఈమెతో ఒక ప్రమాదకరమైన ఆట ఆడిపిస్తాడు. ఆమె అతనిని ఎదుర్కునే సన్నివేశాలతో స్టోరీ మూవ్ అవుతుంది. ఈ మూవీ మొదటి నుంచి చివరిదాకా చాలా సస్పెన్స్ తో ఉంటుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో చూడవచ్చు.
పోషం పా (Posham Pa)
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 2019లో హిందీ భాషలో రిలీజ్ అయింది. మహి గిల్, సయాని గుప్తా, రాగిణి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సుమన్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో అంజన అనే మహిళ తోపాటు ఆమె కూతుర్లు ప్రమాదకరమైన నేరస్తులుగా ఉంటారు. 12 మంది పిల్లలను హత్య చేసిన సీరియల్ కిల్లర్ లుగా వీరి పాత్ర ఉంటుంది. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సైకోథ్రిల్లర్ మూవీ జీ ఫైవ్ (Zee5) లో అందుబాటులో ఉంది.