Best Sci-Fi Movies on Netflix : ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో సైన్స్ ఫిక్షన్ సినిమాల జోరు నడుస్తోంది. గాడ్జిల్లా లాంటి చిన్న పిల్లలు మెచ్చే సినిమాల నుంచి, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లాంటి యాక్షన్ సినిమాలు నెట్ఫిక్స్ లో అదరగొడుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలు ఫ్యామిలీతో సహా చూసి ఎంటర్టైన్ అవ్వండి.
గాడ్జిల్లా మైనస్ వన్ (Godzilla Minus one)
2023లో విడుదలైన ఈ జపనీస్ గాడ్జిల్లా మైనస్ వన్ మూవీకి తకాషి యమజాకి దర్శకత్వం వహించారు. విజువల్ ఎఫెక్ట్‌లతో రూపొందించబడిన ఈ మూవీలో, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్న మాజీ కామికేజ్ పైలట్‌గా ర్యూనోసుకే కమికి నటించారు. గ్రేట్ వార్ ఆఫ్ ఆర్కిమెడిస్ పూర్తయిన తర్వాత గాడ్జిల్లా మైనస్ వన్ మూవీని రూపొందించడానికి నిర్మాత మినామి ఇచికావా, తకాషి యమజాకిని ఈ మూవీ దర్శకత్వ భాధ్యతను అప్పగించి నిర్మించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ రాబట్టింది.
స్పైడర్ మాన్ : అక్రాస్ ది స్పైడర్ వర్స్ (Spider-Man: across the spider Verse)
2023లో వచ్చిన ఈ అమెరికన్ యానిమేటెడ్ సూపర్ హీరో మూవీని, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి కొలంబియా పిక్చర్స్, సోనీ పిక్చర్స్ నిర్మించాయి. ఈ మూవీ స్పైడర్-మ్యాన్: ఇన్‌టు ది స్పైడర్-వెర్స్‌కి సీక్వెల్ గా వచ్చింది. ఈ మూవీకి జోక్విమ్ డాస్ శాంటోస్, కెంప్ పవర్స్, జస్టిన్ కె. థాంప్సన్ కలసి దర్శకత్వం వహించారు. హైలీ స్టెయిన్‌ఫెల్డ్, బ్రియాన్ టైరీ హెన్రీ, లారెన్ వెలెజ్, జేక్ జాన్సన్, జాసన్ స్క్వార్ట్‌జ్‌మాన్, ఇస్సా రే, కరణ్ సోని, షియా విఘమ్, గ్రేటా లీ ఈ మూవీకి వాయిస్ అందించారు.
ఆక్సిజన్ (Oxygen)
2021లో వచ్చిన ఈ ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని అలెగ్జాండ్రే అజా నిర్మించి దర్శకత్వం వహించారు. మాథ్యూ అమల్రిక్, మాలిక్ జిదీ సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మే 12, 2021న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు ఈ మూవీ అందుకుంది.
మ్యాడ్ మ్యాక్స్ : ఫ్యూరీ రోడ్ (Mad Max : Fury Road)
2015లో విడుదలైన ఈ ఆస్ట్రేలియన్ యాక్షన్ ఫిల్మ్ మూవీకి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని విలేజ్ రోడ్‌షో పిక్చర్స్, రాట్‌పాక్-డూన్ ఎంటర్‌టైన్‌మెంట్ పై కెన్నెడీ మిల్లర్ నిర్మించారు. ఈ మూవీలో నికోలస్ హౌల్ట్, హ్యూ కీస్-బైర్నే, రోసీ హంటింగ్టన్-వైట్లీ, రిలే కీఫ్, జోయ్ క్రావిట్జ్, అబ్బే లీ నటించారు. పెట్రోలు, నీరు కొరత ఉన్న ఎడారి భూమిలో నాయకుడు ఇమ్మోర్టన్ జో కి, అతని సైన్యానికి వ్యతిరేకంగా ఇంపెరేటర్ ఫ్యూరియోసా సుదీర్ఘ రహదారి యుద్ధానికి దారితీస్తారు.
స్పేస్ స్వీపర్స్ (Space Sweepers)
స్పేస్ స్వీపర్స్ అనే ఈ మూవీకి జో సంగ్-హీ దర్శకత్వం వహించారు. 2021 లో వచ్చిన ఈ దక్షిణ కొరియా అంతరిక్ష మూవీలో సాంగ్ జుంగ్కి, కిమ్ తాయ్రి, జిన్ సియోన్క్యు యు హేజిన్ నటించారు. ఈ కొరియన్ ఫిల్మ్ మొదటి సారిగా స్పేస్ బ్లాక్‌బస్టర్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 5, 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.