OTT Movie : ప్రశాంతంగా ఏదైనా సినిమా చూడాలి అనుకుంటే మలయాళం సినిమాలు బెస్ట్ ఆప్షన్. వాటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. ఒక చిన్న పాయింట్ ను తీసుకుని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. బావి దగ్గర ఉండే ఒక పంప్‌సెట్ మోటార్ ను దొంగలించడంతో స్టోరీ మొదలు అవుతుంది. ఇందులో న్యాయ వ్యవస్తలో ఉండే లోపాలు సెటైరికల్ గా చూపించడం జరిగింది. ఈ మలయాళం సినిమా ఓటీటీలో మంచి టాక్ తో దూసుకుపోతోంది. సీనియర్ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ మలయాళ మూవీ పేరు ‘జలధర పంప్‌సెట్ సిన్స్ 1962’ (Jaladhara Pumpset Since 1962). 2023 లో విడుదలైన ఈ సినిమాకు ఆశిష్ చిన్నప్ప దర్శకత్వం వహించారు. ఇందులో ఇంద్రన్స్, సనుషా, సాగర్ రాజన్, జానీ ఆంటోనీ, టీజీ రవి, విజయరాఘవన్, నిషా సారంగ్, జయన్ చేర్తలా కీలకపాత్రలు పోషించారు. సినిమాలో పంప్ సెట్ దొంగతనం కేసు సంవత్సరాల పాటు కోర్టులో సాగడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని సెటైరికల్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు మేకర్స్.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ మృణాళిని అనే రిటైర్డ్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఇంటి సమీపంలోని బావి నుండి ఒక పంప్‌సెట్ మోటార్ దొంగతనం అవుతుంది. దానిని మణి అనే దొంగ చోరీ చేస్తాడు. ఈ చిన్న ఘటన ఒక పెద్ద కేసుగా మారి, సంవత్సరాల తరబడి కోర్టులో సాగుతుంది. ఇది భారతీయ న్యాయవ్యవస్థలోని లోపాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. మృణాళిని భర్త ఈ దొంగపై కేసు పెడతాడు. అయితే అతను కొంత కాలానికి చనిపోతాడు. అయినా ఈ కేసు ఇంకా సాగుతూనే ఉంటుంది. ఈ కేసును నడిపించడానికి మృణాళిని స్వచ్ఛంద రిటైర్మెంట్ కూడా తీసుకుంటుంది. అయితే ఆమె కుమార్తె, ఈ కేసును ఎందుకు ఇంతగా పట్టుకుని వేలాడుతున్నావు ? అని గట్టిగానే అడుగుతుంది. ఆమె తల్లి అతిగా ఈ కేసును చూస్తోందని భావిస్తుంది.
కేసు సాగుతున్న కొద్దీ, మృణాళిని, మణి ఇద్దరి జీవితాలలో కొన్ని సవాళ్లను ఎదుర్కుంటారు. మరోవైపు మణి దొంగతనాన్ని అంగీకరించడానికి నిరాకరించడం వల్ల, కేసు మరింత ఆలస్యం అవుతుంది. కోర్టు కూడా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతుంది. చివరికి ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా ? దొంగ నేరం ఒప్పుకుంటాడా ? కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది ? అసలు దొంగతనం చేసింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మలయాళ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : తాగిన మత్తులో కూతురని కూడా చూడకుండా … ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ క్లైమాక్స్ కి ఫ్యూజులు అవుట్