E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఇరికించిన రోహిణి.. కొత్త కాపురం మొదలెట్టిన బాలు, మీనా..

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఇరికించిన రోహిణి.. కొత్త కాపురం మొదలెట్టిన బాలు, మీనా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు పుస్తెలు కొనలేడని ప్రభావతి అవమానిస్తుంది. కానీ బాలు మాత్రం పుస్తెలు తీసుకురావడం తో ప్రభావతి షాక్ అవుతుంది. మీనా మాట నిలబెట్టడంతో బాలు పై ప్రశంసలు కురిపిస్తుంది. మీనా బాలు గదిలోకి వెళ్తారు. మీనా మాట నిలబెట్టుకున్నందుకు బాలుపై ప్రశంసలు కురిపిస్తుంది. నా మాటని మీరు నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానికి బాలు బంగారం కొనిస్తే భార్యలు ఇలా సంతోషపడతారా అని అడుగుతారు. బంగారం కొన్నందుకు కాదు బంగారం కన్నా ఎక్కువైనా నా మాటని మీరు నిలబెట్టారు అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి మీనా అంటుంది. దానికి బాలు నువ్వు నీ బంగారు ఇచ్చినప్పుడు లిస్ట్ రాసావు కదా అందులోంచి పుస్తెలు తీసేయి మిగతా ఒక్కోటి ఒక్కోటిగా మనం కొనేద్దామనేసి బాలు అంటాడు. మిగిలినవి నాకు ఇప్పుడు ఏమి అక్కర్లేదండి పుస్తెలు చాలు అని మీనా అంటుంది. మీ అప్పులు తీరాకే నాకు మిగిలినవి కొనివ్వొచ్చు అని అంటుంది. మీనా మాటలు విన్న బాలు సంతోషపడతాడు. వీరిద్దరి ఎమోషనల్ సీన్ ఎపిసోడ్కి హైలెట్ అవుతుంది. రోహిణికి ప్రభావతి బిగ్ షాక్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి దగ్గరకు వెళ్లి మీనా పై తన అక్కసును కక్కేస్తుంది ప్రభావతి. కారు డ్రైవరే దానికి బంగారం కొనిస్తే మరి నా ఇద్దరు కోడలు కూడా బంగారం వేసుకొని తిరగాలి కదా దాని ముందు దర్జాగా ఉండాలి కదా అనేసి ప్రభావతి ఆలోచిస్తుంది. ఇక అనుకున్నట్లుగానే ముందుగా రోహిణి దగ్గరికి వెళ్లిన ప్రభావతి ఆఫ్ట్రాల్ కారు డ్రైవింగ్ చేసుకునే వాడే బంగారం కొంటున్నాడు మరి నీ దగ్గర అన్ని బంగారు నగలు ఉన్నాయి కదా నువ్వు వేసుకోకుండా బయటికి వెళ్ళవద్దు అనేసి అడుగుతుంది. దానికి రోహిణి షాక్ అవుతుంది. బంగారు నగలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి ఈవిడ ఆశలకైనా ఒక హద్దు ఉండాలి రోజుకు ఏదొక విధంగా నన్ను చంపేస్తుంది అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement

ఇక ప్రభావతి ఏంటమ్మా రోహిణి ఆలోచిస్తున్నావు నీ నగలు ఉన్నాయి కదా పెళ్లి అవి వేసుకుని పార్లర్కి వెళ్ళు అంటుంది. నువ్వు అసలే పార్లర్కి ఓనర్వి కదా ఓనర్ లాగే ఉండాలి ఇలా వెళ్తే పనోళ్ళు అనుకుంటారు అని ప్రభావతి అనగానే రోహిణి కాసేపు షాక్ అవుతుంది అది కాదు ఆంటీ ఇప్పుడు కస్టమర్లు అందరూ నేనెలా చేయాలని ఆలోచిస్తారు నేను చేసే వర్క్ విషయంలో కాస్త బిజీగా ఉంటాను ఇప్పుడు నగలు వేసుకొని అక్కడ తిరిగితే ఏం బాగుంటుంది పైగా నగల కోసమే ఫోజు కొడుతుంది అనుకుంటారేమో అని రోహిణి ప్రభావతికి రివర్స్ షాక్ ఇస్తుంది.. దానికి అది నిజమే కదా అని ప్రభావతి అనుకుంటుంది.

అయినా కూడా మెడలో ఒట్టి పసుపు తాడుతోనే వెళ్తున్నావ్ కనీసం తాడైన వేసుకుని వెళ్ళు అని ప్రభావతి.. మీనాకు బాలు చేయించాడు. మీనా గౌరవాన్ని బాలు పెంచాడు. అలాగే మనోజ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు కదా ఆంటీ.. మనోజ్ కూడా ఏదైనా బంగారు నాకు కొంటే నేను గొప్పగా చెప్పుకొని మనోజ్ ని తిట్టిన వారి నోరు మూయించి మరీ వేసుకుంటానని మనోజ్ ని ఇరికిస్తుంది. సరే అమ్మ నీ ఇష్టం. వాడు ఎలాగో జాబ్ లో జాయిన్ అయ్యాడు కదా నీకోసం ఆ మాత్రం చేయలేడు అనేసి ప్రభావతి గొప్పలు చెప్తుంది. అయినా బాలుకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆంటీ.. మీనా షాప్ పెట్టింది కదా ఆ షాప్ బాగా జరుగుతుంది ఆ డబ్బుల్ని బాలుకి ఇచ్చినట్టు ఉంది అని రోహిణి మీనాను ఇరికిస్తుంది. పూల కొట్టు పెట్టింది అన్నమాట కానీ ఏ రోజు ఇంట్లోకి డబ్బులు ఇవ్వలేదు వాడికే ఇచ్చి ఉంటది అనేసి ప్రభావతి కూడా అనుమాన పడుతుంది.

Advertisement

దిలీప్ వాడికి గోల్ ఏంటి నాకు అని ఆలోచిస్తూ ఉంటుంది. వీడికి ఎలాగైనా చెక్కు పెట్టాలి లేకపోతే నా జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. గుడి కి వెళ్ళాలి అని తర్వాత రోజు ఉదయం బాలు దగ్గరికి వెళ్లి అడుగుతుంది. మా పూల గంప సంతోషమే నా సంతోషమని బాలు అంటాడు.. బాలు, మీనా ఇద్దరు కలిసి సంతోషంగా గుడికి వెళ్తారు. అప్పటికే మీనా తన అమ్మ చెల్లి తమ్ముడు తో కలిసి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయిస్తుంది. మన పెళ్లి జరిగినప్పుడు మీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మనిద్దరం ఒక్కరంటే ఒకరు ఇష్టపడి మరి పెళ్లి చేసుకుందామని మీనాతో బాలు అంటాడు.. ఇక ఇద్దరూ సంతోషంగా పెళ్లి పీటల మీద కూర్చొని మరోసారి పెళ్లి చేసుకుంటారు.. ఇప్పుడు మనం నిజమైన భార్య భర్తలం ఒకరిపై ఒకరికి ఇష్టంతో పెళ్లి చేసుకుందామని మీనా అనగానే బాలు సంతోష్ పడతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపు ఏం జరుగుతుందో చూడాలి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×