E-Paper
Advertisement

OTT Movie : ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉన్న తమిళ సైకో కిల్లర్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

OTT Movie : ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉన్న తమిళ సైకో కిల్లర్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే?
Advertisement

OTT Movie : ఒంట్లో వణుకు పుట్టించే తమిళ సైకో కిల్లర్ మూవీస్ చూడాలనుకుంటున్నారా ? అయితే వీటిని మాత్రం మిస్ చేయకండి. ఒక్కసారి చూశాక మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటాయి. ఒక వేల ఇదివరకే వీటిని చూసినా, మళ్ళీ ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలసి చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాల పేర్లు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే వివరాల్లోకి వెళితే ..

రాట్సాసన్ సిగప్పు రోజక్కల్ (Ratsasan Sigappu Rojakkal)

Advertisement

1978లో విడుదలైన ఈ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి భారతీరాజా దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ఈ సినిమాలో గౌండమణి , భాగ్యరాజ్, వడివుక్కరాసి సహాయక పాత్రల్లోనటించారు. ఈ స్టోరీ స్త్రీలతో ఏకాంతంగా గడిపిన తరువాత, రహస్యంగా వాళ్ళను చంపే దిలీప్ అనే సైకో చుట్టూ తిరుగుతుంది. 1978న విడుదలైన ఈ సినిమా చాలా థియేటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఇది ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలలో రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాని భారతీరాజా స్వయంగా హిందీలో రెడ్ రోజ్ (1980) పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.

అన్నీయన్ (Anniyan)

Advertisement

2005లో విడుదలైన ఈ తమిళ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఎస్ . శంకర్ దర్శకత్వం వహించగా , వి. రవిచంద్రన్ నిర్మించారు. ఈ మూవీలో విక్రమ్ చట్టాన్ని గౌరవించే న్యాయవాదిగా నటించాడు. అతను డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్‌తో బాధపడుతుంటాడు. తెలుగులో ‘అపరిచితుడు’ గా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో విక్రమ్, సధ , ప్రకాష్ రాజ్ , వివేక్ , నేడుముడి వేణు , నాసర్ నటించారు. ఈ మూవీ జీ 5 (Zee 5), యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.

వెట్టైయాడు విలైయాడు (Vettaiyaadu Vilaiyaadu)

2006 లో విడుదలైన ఈ తమిళ నియో-నోయిర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కమల్ హాసన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించగా , కమలినీ ముఖర్జీ , ప్రకాష్ రాజ్ , డేనియల్ బాలాజీ, సలీం బేగ్ సహాయక పాత్రలు పోషించారు.ఈ స్టోరీ ఇద్దరు సీరియల్ కిల్లర్లైన అముధన్, ఇల్లమారన్‌లను పట్టుకోవడానికి ప్రయత్నించే DCP రాఘవన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాకు కమల్ హాసన్ ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు . ఈ మూవీ జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇమైక్కా నోడిగల్ (Imaikkaa Nodigal)

2018లో విడుదలైన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఇందులో నయనతార , అథర్వ , రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించగా, అనురాగ్ కశ్యప్ , బేబీ మనస్వి , వినోద్ కిషన్ , రమేష్ తిలక్ , దేవన్ సహాయక పాత్రల్లో నటించారు. ఇందులో విజయ్ సేతుపతి అతిధి పాత్రలో కనిపిస్తారు. హిప్హాప్ తమిజా సంగీతం సమకూర్చగా, సిజె జయకుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ స్టోరీ ఒక సీరియల్ కిల్లర్‌ను తెలివైన సిబిఐ అధికారి ఎలా పట్టుకుంటారనేదానిపై తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : మహిళ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు … కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×