BigTV English

OTT Movie: మహిళ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు … కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie: మహిళ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు … కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు, ఇప్పుడు ఓటిటిలో అదరగొడుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇటువంటి సినిమాలు, మంచి కలెక్షన్స్ కూడా సాధించాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ స్టోరీ, ఒక యువతి మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ చివరి వరకు సస్పెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. హంతకుడు ఎవరు అనే విషయంపై ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

నర్మద అనే యువతి రక్తపు మడుగులో చనిపోయి ఉంటుంది. ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారు. ఆమె తన ప్రియుడు ఇన్బా తో చాలా రోజుల నుంచి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. ఈ కేసును ఫోరెన్సిక్ నిపుణుడైన ఇన్‌స్పెక్టర్ అగ్ని, లూనా అనే మరొక పోలీస్ ఆఫీసర్ తో కలిసి దర్యాప్తు చేస్తాడు. అగ్నికి నిక్టోఫోబియా (చీకటి భయం) ఉండటం వల్ల దర్యాప్తులో అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు. దర్యాప్తు ప్రారంభంలో, హత్యకు గురైన నర్మద ప్రియుడు ఇన్బాపై అనుమానం వస్తుంది. ఎందుకంటే వారి సంబంధంలో సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. అగ్ని, లూనా కలసి ఇన్బాతో పాటు, నర్మద స్నేహితురాలిని, హత్యకు ముందు ఆమెతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని కూడా విచారిస్తారు. ఈ విచారణలో ఒకే విషయాన్ని ముగ్గురు వ్యక్తులు విభిన్న రీతిలో సమాధానం చెప్తారు.


దర్యాప్తు ముందుకు సాగుతున్నప్పుడు, ఇన్బా తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు. కానీ అగ్నిఈ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఎందుకంటే ఆ సమయంలో, ఒక వ్యక్తి సంఘటనా స్థలం నుండి పారిపోతున్నట్లు అగ్ని గమనిస్తాడు. అగ్ని ఫోరెన్సిక్ విశ్లేషణల ద్వారా హంతకుడిని కనుగొనే ప్రయత్నం చేస్తాడు. చివరికి హంతకున్ని అగ్ని కనిపెడతాడా ? ఇన్బా నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా ? ఈ కేసులో అగ్ని వెలుగులోకి తెచ్చే రహస్యాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : పోలీసులనే తికమక పెట్టే వింత ఊరు … ఊహకందని ట్విస్టులతో క్లైమాక్స్ వరకు గందరగోళమే

యూట్యూబ్ (Youtube) లో

ఈ తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘V1 : మర్డర్ కేస్’ (V1 : Murder Case). 2019 లో వచ్చిన ఈ మూవీకి పావెల్ నవగీతన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ అరుణ్ క్యాస్ట్రో, విష్ణుప్రియ పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2019 డిసెంబర్ 27 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్ (Youtube) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×