BigTV English

Human Workers No AI: ఏఐ ఉందిగా అని ఉద్యోగులను తొలగించిన కంపెనీ.. నిండా మునిగింది

Human Workers No AI: ఏఐ ఉందిగా అని ఉద్యోగులను తొలగించిన కంపెనీ.. నిండా మునిగింది

Human Workers No AI| ఇప్పుడు చాలా కంపెనీలు ఖర్చు తగ్గింపు పేరుతో.. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేషన్‌ పట్ల నమ్ముకుంటున్నాయి. అందుకే.. మానవ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇది సరైన నిర్ణయమని సమర్థించుకుంటున్నాయి. నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తొలగించి, వాటి స్థానంలో ఏఐ వ్యవస్థలను తీసుకురావడం వంటి చర్యలు ఇప్పుడు సాధారణమవుతున్నాయి. కానీ దీనికి సంబంధించిన లోటుపాట్లు ఏమిటో స్వీడన్‌కు చెందిన ఒక ప్రముఖ కంపెనీకి ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకంటే ఆ కంపెనీ ఉద్యోగులను తొలగించాక భారీగా నష్టాలు చూడవల్సి వచ్చింది.


స్వీడన్‌ దేశానికి చెందిన ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ.. క్లార్నా (Klarna).. 2022లో భారీ స్థాయిలో మొత్తం 700 మంది ఉద్యోగులను తొలగించేసింది. ఆ తరువాత.. ఓపెన్‌ఏఐ (OpenAI) సహాయంతో ఏఐ ఆధారిత వ్యవస్థలను అందులో ప్రవేశపెట్టింది. 2023 నాటికి ఈ సంస్థ పూర్తిగా మానవ నియామకాలను ఆపేసింది. అంటే కొత్తగా మానవ ఉద్యోగులను తీసుకోవడం పూర్తిగా నిలిపివేసింది.

అయితే, ఈ లేఆఫ్‌లు (ఉద్యోగుల తొలగింపు చర్య) చేసిన విధానం అప్పట్లో పెద్దగా వివాదాస్పదమైంది. ఉద్యోగుల తొలగింపును ముందుగానే ఒక వీడియో రూపంలో రికార్డ్ చేసి వారి దృష్టికి తీసుకురావడం చేసింది. అంతేకాదు, వారి వ్యక్తిగత డేటాను లీక్ చేయడంతో ఈ సంస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.


ఈ చర్యల కారణంగా సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. ఏఐ ఆధారిత కస్టమర్ సర్వీసులు కంపెనీ అంచనాలకు అనుగుణంగా పనిచేయలేదు. వీటి వల్ల కస్టమర్ సంతృప్తి మరింత తగ్గిపోయింది. పైగా, ఉద్యోగుల తొలగింపును నిర్వాకంగా, అసభ్యంగా నిర్వహించడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం కంపెనీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది.

ఈ నిర్ణయాలు ఆర్థికపరమైన దుష్పరిణామాలకు దారితీశాయి. 2021లో కంపెనీ విలువ (వ్యాల్యూయేషన్) 45.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2022 నాటికి అది కేవలం 6.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ భారీ తగ్గుదల పెట్టుబడిదారుల్లో భయం కలిగించింది. ఏఐ ఆధారిత వ్యూహం ఫలించలేదనే అభిప్రాయం ఎక్కువమంది పెట్టుబడిదారులలో చోటుచేసుకుంది.

Also Read: యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు.. ఇప్పుడంతా అమ్మాయిల ఇష్టానుసారమే

కంపెనీ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. ఏఐ ఆధారిత సేవలు కస్టమర్ సంతృప్తిని తగ్గించాయనీ, లేఆఫులు చేపట్టడంలో తాము పొరపాటు చేశామనీ కంపెనీ సీఈఓ సెబాస్టియన్ సీమియట్కోవ్‌స్కీ అంగీకరించారు. ఖర్చు తగ్గించడంపైనే అధికంగా దృష్టి పెట్టామని, అయితే ఇది సేవల నాణ్యతను ప్రభావితం చేసిందని ఆయన అంగీకరించారు.

ఇప్పుడు కంపెనీ తన గత వైఖరిని మార్చుకుంది. నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తొలగించడం వల్ల వచ్చిన నష్టాన్ని గ్రహించి, తిరిగి నియామకాల వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కస్టమర్ సర్వీసుల విభాగంలో భారీగా ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని రిమోట్ వర్క్‌ అవకాశాలను కూడా అందిస్తోంది.

ఇలా, ఏఐపై పూర్తిగా ఆధారపడటమే కాకుండా, మానవ వనరుల ప్రాముఖ్యాన్ని తిరిగి గుర్తించి, క్లార్నా సంస్థ మానవీయ విధానాల వైపు మళ్లడం ఇప్పుడు ముఖ్యాంశంగా మారింది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×