Thriller Movie OTT : థ్రిల్లర్ మూవీస్ ఓటీటీలోనే ఎక్కువగా సక్సెస్ టాక్ ను అందుకుంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలై సక్సెస్ ను అందుకుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం నేరుగా ఓటీటిలోనే విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక జనాలను ఆకట్టుకోవడం కోసం ఓటీటీ సంస్థలు కొత్త కొత్త సస్పెన్స్ కథలను కూడా ఓటీటీలోకి తీసుకొని వస్తున్నారు. ఈ మధ్య ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ థ్రిల్లర్ మూవీనే ఎక్కవగా స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నాయి. ఇప్పుడు అదిరిపోయే సస్పెన్లతో మిస్టరీ థ్రిల్లర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఆ మూవీనే ‘కిష్కింద కాండం’.. ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
కిష్కింద కాండం’ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. రెండు నెలల క్రితం సెప్టెంబర్ 12 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సినిమాకు పెట్టిన బడ్జెట్ కన్నా పదిరెట్లు ఎక్కువగా వసూల్ చేసింది. కేవలం రూ. 5 కోట్లతో సినిమాను తీస్తే, రూ. 50 కోట్లకు పైగా వసూల్ చేసింది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. కేవలం మౌత్ టాక్‌తో మలయాళంలో ‘కిష్కింద కాండం’ సూపర్ హిట్‌గా నిలిచింది. కిష్కింద కాండం టైటిల్ వెనుక ఒక కారణం ఉంది. కోతులు ఎక్కువగా కనిపించే ఆ ఊర్లో వరుసగా ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. సినిమాలో మిస్టరీని ఛేదిస్తున్న క్రమంలో మనిషి శవం ప్లేస్‌లో కోతి శవం కనిపించడంతో సినిమాపై ఆసక్తి రెట్టింపు అయ్యింది. అసలు ఆ మనిషి శవం ఎక్కడ మాయం అయ్యింది. కోతి శవం ఎలా వచ్చింది? ఎవరు మార్చారు? ఇలా అనేక సస్పెన్స్ లతో ట్విస్ట్ లతో సినిమా ఆడియన్స్ ఊహకు అందని ట్విస్ట్లతో సాగుతుంది.
ఇక కిష్కింద కాండం మూవీ ఓటీటీ హక్కుల్ని భారీ ధరకి డిస్నీ+ హాట్‍స్టార్ చేజిక్కించుకోగా.. అక్టోబరులోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.కానీ అప్పుడు కాస్త బ్రేక్ పడింది. దీంతో ఈ మూవీ నవంబర్ నెలలో ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీని నవంబర్ 19 న ఓటీటీలో స్ట్రీమింగ్ చెయ్యనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. అజయన్, అపర్ణ) పెళ్లి చేసుకుంటారు. వాస్తవానికి అప్పటికే అజయన్‌కి పెళ్లి అయ్యి.. ఒక కొడుకు కూడా ఉంటాడు. కానీ.. భార్య చనిపోవడంతో అపర్ణని రెండో వివాహం చేసుకుంటాడు. అయితే.. ఈ వివాహమైన కొన్ని రోజులకే మొదటి భార్య కొడుకు మాయమైపోతాడు. ఆ వ్యక్తి గన్ కూడా మాయం అవుతుంది. మరి చివరికి ఆ గన్ తో అనేక మర్డర్ లు కూడా జరుగుతాయి. ఆ తర్వాత గన్ ఎలా దొరుకుతుంది. ఈ హత్యలు జరగడానికి కారణం ఎవరు అనే స్టోరీ పై సినిమా కథ సాగుతుంది.