Best OTT Romantic Movies : ఇండియన్ సినిమా ఇండస్ట్రిలో సౌత్ అన్ని జానర్లలోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటుంది. యాక్షన్ తో దుమ్ము దులపడమే కాదు వావ్ అన్పించే ప్రేమ కథలను కూడా తెరకెక్కించి కిక్ ఇస్తున్నారు సౌత్ మేకర్స్. ఇక ముఖ్యంగా కొన్ని లవ్ స్టోరీలు అయితే చూస్తున్నంతసేపు రొమాంటిక్ గా, ఫీల్ గుడ్ మూవీ అన్పించేలా మనసుకు హాయిగా ఉంటుంది. ఇలాంటి రిఫ్రెషింగ్ స్టోరీస్ లోతైన భావోద్వేగాలతో, హృదయానికి హత్తుకునే విధంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీల గురించి వెతికే వారి కోసం, సౌత్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్స్.
ఏ మాయ చేశావే (Ye Maaya Chesave) – జీ 5 (Zee5)
మాజీ భార్యాభర్తలు, ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీలు నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు ఫస్ట్ టైమ్ జంటగా నటించిన లవ్ స్టోరీ ‘ఏ మాయ చేశావే’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రం విభిన్నమైన అభిరుచి ఉన్న ఇద్దరు ప్రేమికుల ప్రేమ ప్రయాణాన్ని చూపిస్తుంది. కార్తీక్ డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. వయసులో తనకంటే పెద్దదైన జెస్సీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. చివరికి వీరిద్దరి లవ్ స్టోరీ ఏమైంది అనేది కథ. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాలో మెయిన్ హైలెట్. ఇక టాలీవుడ్ చరిత్రలో ఇదొక ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ. ఈ మూవీ ప్రస్తుతం జీ 5, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లలో కూడా అందుబాటులో ఉంటుంది.
సీతారామం (Sita Ramam) – డిస్ని ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar)
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మరో తెలుగు ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అందమైన పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ప్రేమ, యుద్ధాన్ని కలిపి మనసుని కదిలించే కథను ఈ సినిమా ద్వారా తెరపై చూపించారు మేకర్స్. యువరాణి స్థాయిలో ఉండే సీత పేరు మార్చుకుని లెఫ్టినెంట్ రామ్ తో మొదలెట్టే అందమైన ప్రేమకథ చివరకు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతోంది.
గీత గోవిందం (Geetha Govindam) – డిస్ని ప్లస్ హాట్ స్టార్ (Dinsey Plus Hotstar)
‘గీత గోవిందం’ మూవీ కేవలం మంచి లవ్ స్టోరీ మాత్రమే కాదు అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. సినిమా మాత్రమే కాదు పాటలు కూడా బాగుంటాయి ఈ మూవీలో. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ మూవీ ప్రస్తుతం డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.