BigTV English

Bigg Boss 8 Telugu: పృథ్వి నావాడు.. ఓపెన్‌గా చెప్పేసిన విష్ణుప్రియా, నామినేషన్స్‌లోనూ అదే గొడవ

Bigg Boss 8 Telugu: పృథ్వి నావాడు.. ఓపెన్‌గా చెప్పేసిన విష్ణుప్రియా, నామినేషన్స్‌లోనూ అదే గొడవ

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో ఒక డిఫరెంట్ వన్ సైడ్ లవ్ స్టోరీ రన్ అవుతోంది. ఇప్పటివరకు జరిగిన ఏ బిగ్ బాస్ సీజన్‌లో కూడా ఇలా జరగలేదు. ఒక అబ్బాయి వెళ్లి అమ్మాయిని ఇష్టపడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక అమ్మాయే వెళ్లి అబ్బాయిపై ఇంత పిచ్చి ప్రేమ పెంచుకోవడం ఇదే మొదటిసారి. ఇంతకీ వారెవరో కాదు.. విష్ణుప్రియా, పృథ్వి. తను ఎంత దూరం పెట్టినా పృథ్విని వదిలి ఉండలేపోతుంది విష్ణుప్రియా. గత కొన్నివారాలుగా తనను అదే కారణంపై కంటెస్టెంట్స్ నామినేట్ చేస్తూ ఉన్నారు. అయినా తన పద్ధతి మారడం లేదు. ఈ వారంలో అయితే ఏకంగా కంటెస్టెంట్స్ అందరి ముందు షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది విష్ణుప్రియా.


బెదరని గౌతమ్

ముందుగా గౌతమ్ వెళ్లి పృథ్విని నామినేట్ చేశాడు. ఫ్రెండ్‌షిప్ పేరుతో మనుషులను ప్రభావితం చేస్తాడని, ఫిజికల్ గేమ్స్ ఆడతాడని కారణాలు చెప్పాడు. ప్రేక్షకులకు కూడా ఆ కారణాలు కరెక్టే అనిపించినా పృథ్వి మాత్రం వాటిని అస్సలు ఒప్పుకోలేదు. పొగరుగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ గౌతమ్ మాత్రం అస్సలు తగ్గలేదు. తను కూడా కూల్‌గానే కౌంటర్లు ఇచ్చాడు. ఈమధ్యకాలంలో పృథ్వి పొగరు మరీ పెరిగిందని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశాడు. కానీ గౌతమ్.. పృథ్విని నామినేట్ చేశాడనే విషయం విష్ణుప్రియాకు నచ్చక అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన పృథ్వి.. అవినాష్‌ను నామినేట్ చేశాడు కానీ సరైన కారణాలు చెప్పలేకపోయాడు.


Also Read: బిగ్ బాస్ 8 నుంచి హరితేజ అవుట్.. రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే..?

సపోర్ట్ చేయలేదు

అవినాష్ మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు ఫుడ్ లేట్ అయ్యిందనే విషయాన్ని కారణంగా చెప్పి నామినేట్ చేశాడు పృథ్వి. అది అవినాష్‌కు మాత్రమే కాదు.. హౌస్ అంతా సిల్లీగా అనిపించింది. దీంతో అవినాష్ కూడా ఏం వాదించాలో తెలియక సైలెంట్ అయిపోయి నామినేషన్‌ను ఒప్పుకుంటున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత రోహిణి వెళ్లి విష్ణుప్రియాను నామినేట్ చేసింది. దానికి కారణం చెప్తూ గత వారం జరిగిన మెగా చీఫ్ టాస్కును గుర్తుచేసింది. ముందుగా తనను మెగా చీఫ్ టాస్కులో సపోర్ట్ చేయమని రోహిణి వెళ్లి విష్ణుప్రియాను అడగగా.. తను సరే అని ఒప్పుకుంది. కానీ టాస్క్ మొదలయిన తర్వాత పృథ్వికే సపోర్ట్ చేసింది. అలా చేయడం తనకు నచ్చలేదని రోహిణి తనను నామినేట్ చేసింది.

తనే ముఖ్యం

రోహిణి కూడా తన వెనుక మాట్లాడిన మాటల గురించి తనకు తెలిసిందని, అందుకే తనను మెగా చీఫ్ టాస్కులో సపోర్ట్ చేయలేదని ముక్కుసూటిగానే చెప్పేసింది విష్ణుప్రియా. అంతే కాకుండా రోహిణి తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు తన గురించి ఎలా మాట్లాడుతుందో కూడా తెలుసు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అలా రోహిణి, విష్ణుప్రియా మధ్య పెద్దగా వాగ్వాదం ఏమీ జరగలేదు. కానీ నామినేషన్స్ అయిపోగానే తనకు పృథ్వికి ఎలాంటి గొడవలు జరిగినా, మనస్పర్థలు వచ్చినా తన ప్రాధాన్యత ఎప్పుడూ పృథ్వికే అంటూ గట్టిగా చెప్పేసి వెళ్లిపోయింది విష్ణుప్రియా. ఇక ఈవారం నామినేషన్స్‌లో గౌతమ్, తేజ, పృథ్వి, యష్మీ, విష్ణుప్రియా, అవినాష్ ఉన్నారు.

Related News

Justice For Srija Dammu : శ్రీజ దమ్ము ఎలిమినేట్, హౌస్ లో ఉండాలి అంటూ నెటిజెన్స్

Bigg Boss 9 Promo : సీజన్ 9 లో కొత్త చాప్టర్ మొదలైంది, కన్నీటి కుళాయిలు ఓపెన్, ఆడియన్స్ డెసిషన్ ఏంటి?

Bigg Boss 9: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ట్విస్ట్ ఏంటంటే?

BB9 Wild Cards: నేడే హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్.. ఆ 6గురు వీరే!

Bigg Boss 9: అమ్మ బాబోయ్ ఎంతకు తెగించార్రా? మోసం చేసి కెప్టెన్ అయ్యాడు, షాకింగ్ వీడియో

Bigg Boss 9 : భరణి తనూజ బాండింగ్ కు బ్రేక్ పడినట్లేనా? సంచాలక్ గా ఇమ్ము ఫెయిల్? దుమ్ము లేపిన మాస్

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్

Big Stories

×