Best War Movies : హిస్టారికల్ మూవీలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాలలో ఎక్కువగా హిస్టారికల్ సినిమాలే ఉనాయి. ఉదాహరణకి తెలుగులో రాజమౌళి నిర్మించిన బాహుబలి. ఈ మూవీ ఖండాంతరాలు దాటి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదలై పది సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆ మేనియా తగ్గలేదు. ఇటువంటి బెస్ట్ హాలీవుడ్ హిస్టారికల్ మూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లాడియేటర్ (Gladiator)
ఈ 2000లో రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాక్సిమస్ పాత్రలో రసెల్ క్రౌ అద్భుతంగా నటించాడు. జాక్విన్ ఫైనిక్స్, కానీ నెల్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించాడు. బెస్ట్ అకాడమీ అవార్డును కూడా ఈ మూవీ అందుకుంది. రోమన్ సామ్రాజ్యం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. విలన్ అయిన రోమన్ కింగ్ ను మాక్సిమస్ ఎదుర్కొనే సన్నివేశాలు మూవీకి హైలెట్ గా నిలుస్తాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ట్రాయ్ (Troy)
ఈ మూవీ ఒక సంచలనం సృష్టించింది. 2004 లో ఈ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి వోల్ఫ్ గాంగ్ పీటర్సన్ దర్శకత్వం వహించాడు. బ్రాడ్ ఫిట్, ఎరిక్ బన్ , డైనే క్రూజర్, ఓర్లాండో బ్లూమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రెండు రాజ్యాల యుద్ధ సన్నివేశాలు మామూలుగా ఉండవు. బ్రాడ్ ఫిట్ ఒక్కడే వెళ్ళి ఫైట్ చేసే సీన్ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
300
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. 2007 లో రిలీజ్ అయిన ఈ మూవీకి జాక్ స్నిడర్ దర్శకత్వం వహించాడు. గెరార్డ్ బట్లర్, రోడ్రిగో సంతోరో, లేనా హీడి ప్రధాన పాత్రధారులుగా నటించారు. లియోనిడస్ అనే రాజు 300 మంది యోధులను యుద్ధానికి తీసుకొని వెళ్లి, పదివేల మంది పర్షియన్ సైనికులను ఎదుర్కొంటాడు. వెనకడుగు వేయడం తెలియని ఈ యోధులు చేసే యుద్ధం చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. ఈ మూవీ యుద్ధ సన్నివేశాలతో నిండి ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) , నెట్ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.
బ్రేవ్ హార్ట్ (Braveheart)
ఈ మూవీ హిస్టారికల్ సినిమాలలో బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. 1995 లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ ఎపిక్ హిస్టారికల్ ఫిక్షన్ మూవీకి మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించాడు. సోఫీ మార్క్ , కేథరిన్, అంగస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో హీరో పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. యుద్ధానికి ముందు ఇతడు ఇచ్చే స్పీచ్ ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో బెస్ట్ స్పీచ్ గా నిలిచింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.