Kula Sekhar Death : సినీ ఇండస్ట్రీలో ఫామ్లో ఉన్నంతవరకు జీవితం సాఫిగా సాగిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఒక్కసారి బ్రేక్ పడితే ఇక జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి సంబందించిన వాళ్లంతా చివరి రోజుల్లో దయనీయ పరిస్థితులను అనుభవించి మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ రైటర్ పరిస్థితి కూడా అలానే మారింది అని చెప్పవచ్చు. ఆ రైటర్ మరెవ్వరో కాదు గేయ రచయిత కుల శేఖర్.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుల శేఖర్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే తాజాగా ఆయన మరణం పై ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది.
అదేంటంటే.. నిజానికి ఈయన అనారోగ్య సమస్యల వల్ల చనిపోలేదట.. మరో నిజం వెలుగు చూసింది. ఆయన పంజాగుట్ట సెంటర్ లో నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు ప్రమాదం లో గాయపడ్డారట.. గాయాలతో ఉన్న ఆయనను గాంధీ ఆస్పత్రి లో మరణించాడు. ఆయన గత కొన్నేళ్లుగా చిత్రపురి ఎల్ఐజీ క్వార్టర్ లో ఒక్కడే ఉంటున్నాడు. మొదట అనాధ శవం అనుకున్నారు. తర్వాత కులశేఖర్ అని తెలిసింది. ఈయన పరిస్థితి విన్న అందరికి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈరోజు ఉదయం గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో అంత్యక్రియలు.. ఈయన అంత్యక్రియలకు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరువుతారని సమాచారం..
గేయ రచయిత కులశేఖర్ విషయానికి వస్తే.. 1971 ఆగస్టు 15 వ తేదీన సింహచలం లో జన్మించారు. ప్రముఖ వార్తాపత్రిక లో జర్నలిస్టుగా , తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈయన, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక్కడ గీత రచయితగా మంచి పేరు కూడా సొంతం చేసుకున్నారు కుల శేఖర్.. ఆయన రాసిన ప్రతి పాట రికార్డులు బ్రేక్ చేసాయి. స్టార్ హీరో వెంకటేష్ నటించిన ఘర్షణ సినిమాలో పాటలతో పాటు డైలాగ్స్ కూడా అందించారు కులశేఖర్ ఒక సీన్ డైలాగ్స్ చూసిన వెంకటేష్ స్వయంగా నువ్వే ఈ సినిమాకి డైలాగ్స్ రాసేయనడంతో ఘర్షణ సినిమాకి ఈయన మాటలు అందించినట్లు సమాచారం. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.
ఆయన కేరీర్ సాఫిగా సాగుతున్న సంగతి సమయంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్ల వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యారని వార్తలు కూడా గతంలో వినిపించాయి. ఆయనను కొందరు దొంగ అని ముద్ర వేయగా, మరికొంతమంది పిచ్చివాడు అంటూ కామెంట్లు చేశారు. అందుకు కారణం ఒక హీరోయిన్ అని అప్పటిలో వార్తలు వినిపించాయి. చిన్నప్పటి నుంచి సంగీత, సాహిత్యల మీద ఎక్కువగా ఆసక్తి ఉండేదట చదువుకుంటున్న రోజుల్లోనే పాటలు రాసి బహుమతులు కూడా అందుకున్నారని తెలిసిందే. ఈ టాలెంట్ వల్లే దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ పరిచయం అయ్యారు. ఆయన అప్పటిలో 100 పాటలు రాశారు. ఆ పాటలు ఇప్పటికి వినిపిస్తున్నాయి..