Viral Video: సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. చాలా మంది ఫోన్ ద్వారానే తమ పనులను చక్కదిద్దుకుంటున్నారు. ఆఫీస్ వ్యవహారాల నుంచి వ్యక్తిగత సంగతుల వరకు అన్నీ సెల్ ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఇక కొంత మంది తమ జీవితంలోని ప్రతి మూమెంట్ ను సెల్ ఫోన్ లో ఫోటోల రూపంలో భద్రపర్చుకుంటారు. లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు. మరికొంత మంది సెల్పీలు, రీల్స్ అంటూ చేసే హడావిడి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్పీల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. కొంత మంది సెల్పీలు దిగుతూ నదులు, లోయల్లో పడిపోగా.. మరికొంత మంది రైళ్ల ముందు సెల్ఫీలు తీసుకోవాలని భావించి ప్రాణాలు కోల్పోయారు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టాల మీదికి వెళ్లిన వ్యక్తి
తాజాగా ఓ యువకుడు సెల్ ఫోన్ చూస్తూ చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన అర్జెంటీనాలో జరిగింది. బ్యూనస్ ఎయిర్స్ లో ఓ వ్యక్తి నడుచుకుంటూ రైల్వే క్రాసింగ్ దాటేందుకు ప్రయత్నించాడు. సెల్ ఫోన్ లో చూస్తూ పక్కన ఏం జరుగుతుందో గమనించకుండా వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి రైలు పట్టాల మీదికి అడుగు పెట్టగానే రైలు దూసుకొచ్చింది. అతడి చేతులు రైలుకు తగిలాయి. అదృష్టం బాగుండి పక్కకుపడిపోయాడు. కాస్త ముందుకు వెళ్తే అతడు ప్రాణాలు కోల్పోయే వాడు. ఈ ఘటనతో కాసేపు రైలును ఆపారు. తోటి వాళ్లు ఈ సీన్ చూసి షాక్ అయ్యారు. లీనియర్స్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ తతంగం అంతా రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
This generation has 0 survival skills while on the phone 😳 pic.twitter.com/B0xrAW7rhV
— Second before disaster (@NeverteIImeodd) November 24, 2024
Read Also: తాళ్లు పెట్టి పట్టాలు లాగేసిన యువకులు, నెట్టింట వీడియో వైరల్
నెటిజన్ల ఆగ్రహం
ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. “సెల్ ఫోన్ కు బానిసలుగా మారితే ప్రాణాలు పోవడం ఖాయం అనేందుకు ఇదో ఉదాహారణ” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “సెల్ ఫోన్ ముఖ్యమే, ప్రాణాలు ఇంకా ముఖ్యం అని గమనించాలి” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “సెల్ ఫోన్లతో ప్రాణాలు పోతున్నా, మనుషుల తీరు మారడం లేదు” అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. “కనీసం రోడ్డు మీద నడిచేటప్పుడైనా సెల్ ఫోన్ కు దూరంగా ఉండండి” అంటూ ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ ఘటనలో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడటం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: బాబోయ్.. ఒక్క టీ ధర లక్ష రూపాయలా? నెట్టింట వైరల్ అవుతున్న ‘గోల్డ్ కడక్’ చాయ్ వీడియో!