OTT Movie : హాలీవుడ్ నుంచి కొన్ని సినిమాలు ఊహకందని రీతిలో తెరకెక్కిస్తుంటారు దర్శకులు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాలకు అభిమానులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో మనుషుల రక్తంతో నడిచే కారు చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ కారు చేసే విన్యాసాలు కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి. ఈ థ్రిల్లర్ మూవీ చివరి వరకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘బ్లడ్ కార్’ (Blood car). ఈ బ్లాక్ కామెడీ మూవీకి అలెక్స్ ఓర్ దర్శకత్వం వహించారు. ఇందులో అన్నా క్లమ్‌స్కీ, కేటీ రౌలెట్, మైక్ బ్రూన్ ప్రధాన పాత్రలు పోషించారు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిన భవిష్యత్తు కాలంలో ఈ స్టోరీ రన్ అవుతుంది. ఒక కిండర్ గార్టెన్ ఉపాధ్యాయుడు ఇంధన వనరుతో కాకుండా, రక్తంతో నడిచే కారును కనిపెట్టినప్పుడు స్టోరీ మలుపులు తీసుకుంటుంది. ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉండటంతో, ఒక కొత్త ఇంజిన్ తయారు చేస్తూ ఉంటాడు. ఆ ఇంజన్ కోసం కొత్త రకం ఇంధనం కూడా తయారు చేస్తాడు. అయితే ఆ ఇంధనంతో కారు స్టార్ట్ చేస్తాడు. ఎంత ట్రై చేసినా ఆ ఇంధనంతో కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో ఆలోచనలో పడతాడు. ఇంతలో ఆ ఇంధనంలో ఇతని చేయి తెగి రక్తం పడుతుంది. అప్పుడు ఆ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఆతరువాత హీరోకి విషయం అర్థం అవుతుంది. ఈ కారు రక్తంతో నడుస్తుందని తెలుసుకుంటాడు. తన బాడీలో నుంచి కొంత రక్తం తీసి కారును స్టార్ట్ చేస్తాడు. కొంత దూరం వెళ్లి కారు ఆగిపోతుంది. ఆ తర్వాత కారు డిక్కీలో ఒక మిషన్ తయారు చేస్తాడు. అందులో జంతువులను వేసి వాటి రక్తాన్ని ఇంజన్లోకి వెళ్లేటట్టు ఫిక్స్ చేస్తాడు. అయితే అప్పుడు కూడా కార్ స్టార్ట్ అవ్వదు.
మనుషుల రక్తంతోనే కార్ స్టార్ట్ అవుతుందని తెలుసుకుని, పక్క ఇంట్లో ఉండే ఒక ముసలి బామ్మను చంపి ఆ రక్తంతో కారులో షికారు చేస్తాడు. ఆ కారు వల్ల చాలా మంది ప్రాణాలు పోతాయి. కొన్ని రోజుల తర్వాత హీరోకి, ఆ కారు వల్ల అనుకోని సమస్యలు వస్తాయి. చివరికి ఆ కారు రక్తంతోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఆ కార్ వలన హీరో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న’బ్లడ్ కార్’ (Blood car) అనే ఈ కామిడీ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.