E-Paper
Advertisement

డ్యాన్సర్‌ నుంచి కోట్ల సామ్రాజ్యానికి బాస్‌గా… ఓటీటీలోకి తెలుగులో హై-వోల్టేజ్ డ్రామా

డ్యాన్సర్‌ నుంచి కోట్ల సామ్రాజ్యానికి బాస్‌గా… ఓటీటీలోకి తెలుగులో హై-వోల్టేజ్ డ్రామా
Advertisement

Crime Thriller Series on OTT: ఒకప్పుడు డ్యాన్సర్‌గా పని చేసిన అమ్మాయి… అనుకోకుండా ఓ కోటీశ్వరుల కుటుంబం నడిపే భారీ బిజినెస్ సామ్రాజ్యంలోకి అడుగు పెడుతుంది. అక్కడ ప్రేమ కంటే కుట్రలు, డబ్బు కంటే అధికారం, కుటుంబ బంధాల కంటే మోసాలే ఎక్కువగా ఉంటాయి. కానీ అదే అమ్మాయి చివరికి ఆ సామ్రాజ్యంలోనే కీలక వ్యక్తిగా మారితే ? తనను తొక్కేసిన వాళ్లనే జైలుకు పంపించే స్థాయికి ఎదిగితే ? ఇప్పుడు ఆమె చేతిలోకి వచ్చిన అధికారాన్ని కాపాడుకోవడమే అసలు ఛాలెంజ్ అయితే ? ఈ పవర్ గేమ్, ఫ్యామిలీ వార్, బ్లాక్‌మెయిల్, క్రైమ్‌తో నడిచే సిరీసే ‘Beauty in Black Season 3’. మరి ఈ సీజన్‌లో ఏం జరుగుతుంది ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో చూడొచ్చా ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

కిమ్మీ ఓ ఎక్స్‌టిక్ డ్యాన్సర్‌ గా పని చేస్తూ తన కుటుంబాన్ని కష్టాల నుంచి బయట పడేయాలని ప్రయత్నిస్తుంటుంది. కానీ ఓ అనుకోని పరిచయం ఆమెను కోట్ల విలువైన కాస్మెటిక్స్ సామ్రాజ్యాన్ని నడిపించే బెల్లారీ కుటుంబం దగ్గరకు తీసుకెళ్తుంది. బయటకు ఈ కుటుంబం ఎంతో సంపన్నంగా కనిపించినా… లోపల మాత్రం అక్రమ వ్యాపారాలు, మనుషుల అక్రమ రవాణా, కుట్రలు, బ్లాక్‌మెయిల్‌తో నిండిపోయి ఉంటుంది. మొదట పరిస్థితుల నుంచి బయటపడటానికి ఆ కుటుంబానికి దగ్గరైన కిమ్మీ… క్రమంగా అక్కడ జరుగుతున్న అసలు ఆటను అర్థం చేసుకుంటుంది.

Advertisement

ఇకపై తాను ఎవరి చేతుల్లోనూ పావుగా ఉండకూడదని నిర్ణయించుకున్న కిమ్మీ, కుటుంబ సభ్యుల రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ తన బలాన్ని పెంచుకుంటుంది. ఈ క్రమంలో మల్లరీతో ఆమెకు తీవ్రమైన విభేదాలు ఎదురవుతాయి. కానీ చివరికి ఇద్దరూ కలిసి బెల్లారీ కుటుంబాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. హోరేస్ కూడా వీరితో చేతులు కలపడంతో భారీ ప్లాన్ తో గేమ్ మొదలవుతుంది. కుటుంబానికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి ప్రభుత్వానికి సమాచారం అందిస్తారు. దాని ఫలితంగానే బెల్లారీ కుటుంబంపై FBI రైడ్ జరుగుతుంది. ఇంతకాలం అధికారాన్ని చెలాయించిన కుటుంబ సభ్యులు అరెస్టు అవుతారు.

కానీ కిమ్మీ మాత్రం అక్కడితో ఆగదు. హోరేస్‌తో కలిసి బెల్లారీ బిజినెస్‌పై పట్టు సాధిస్తుంది. డ్యాన్సర్‌గా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు అదే సామ్రాజ్యంలో ఊహించని స్థానానికి చేరుతుంది. అయితే అధికారం సంపాదించడం ఒక ఎత్తయితే… దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. పాత శత్రువులు తిరిగి రావడం, దాచిన రహస్యాలు బయటపడటం, బ్లాక్‌మెయిల్, ప్రతీకారాలు, కుటుంబ అంతర్గత పోరాటాలు కిమ్మీకి కొత్త సమస్యలు తెస్తాయి. చివరికి ఈ సామ్రాజ్యానికి నిజమైన బాస్‌గా కిమ్మీ నిలబడగలదా? లేక ఆమెపై కూడా అదే కుట్రల వల బిగుస్తుందా? అనేదే ఈ సీజన్‌లో ఆసక్తికరమైన అంశం.

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

Advertisement

ఈ సిరీస్ కు టైటిల్ క్రియేటర్, రచయిత, దర్శకుడు, నిర్మాతగా టైలర్ పెర్రీ వ్యవహరించారు. టేలర్ పోలిడోర్ విలియమ్స్, క్రిస్టల్ స్టీవర్ట్, అంబర్ రీన్ స్మిత్, రిక్కో రాస్ కీలక పాత్రల్లో నటించారు. మూడో సీజన్‌లో 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఆగస్టు 27 నుంచి ప్రపంచవ్యాప్తంగా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ఏంటంటే… ఇంగ్షీషుతో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే ఈ సిరీస్‌ను తెలుగులోనూ చూడొచ్చు.

Read Also: నగరాన్ని కమ్మేసే పొగమంచు… హీరోయిన్ల వరుస హత్యలు… అదృశ్య కిల్లర్ అరాచకం

Tags

Related News

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

Big Stories

Advertisement
×