OTT Movie : మద్యానికి అలవాటు పడిన భర్తల వల్ల ఎన్నో కుటుంబాలు చల్లా చెదురు అయిపోయాయి. ఈ మహమ్మారి వల్ల నేరాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దీని గురించి చెప్పాలంటే మాటలు కూడా చాలవు. ఈ మహమ్మారి ఎందరో ఆడవాళ్ళ ఉసురు పోసుకుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మద్యం వల్ల ఒక కుటుంబం ఎలాంటి సమస్యలు ఫేస్ చేసిందో చెప్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
ఆహా (aha) లో
ఈ మూవీ పేరు ‘బాటిల్ రాధ’ (Bottle Radha). 2025లో విడుదలైనఈ కామిడీ ఎంటర్టైనర్ మూవీకి దినకరన్ శివలింగం రచించి, దర్శకత్వం వహించారు. బెలూన్ పిక్చర్స్, TN అరుణ్‌బాలాజీతో కలిసి నీలం ప్రొడక్షన్స్ పై రంజిత్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీని తమిళం, మలయాళం భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. ఇందులో గురు సోమసుందరం, సంచనా నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించగా, జాన్ విజయ్ , లొల్లు సభ మారన్ , మెర్కు తొడార్చి మలై ఆంటోని, పరి ఎలవళగన్, అన్బరసి సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
రాధాకృష్ణ ఎప్పుడూ మందు తాగుతూనే ఉంటాడు. టైల్స్ వర్క్ చేస్తూ తన భార్య పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు. పనికి వెళ్లేటప్పుడు కూడా మందు తాగే వెళతాడు. అయితే వచ్చే సంపాదన రాధాకృష్ణ తాగుడుకే సరిపోతుంది. తాగి ఊరుకోకుండా, అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అయితే తాగితేనే ఈ విన్యాసాలు చేస్తుంటాడు రాధాకృష్ణ. మత్తు దిగినాక భార్య పిల్లలతో మంచిగానే ఉంటాడు. భార్య వసుంధర కూడా ఈ విషయం మీద ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అనుకుంటూ దిగులు పడుతుంది. పని ఇచ్చిన మేస్త్రీ తో కూడా గొడవ పెట్టుకుంటాడు రాధాకృష్ణ. అయితే ఒకరోజు ఇతనికి పెద్ద కాంట్రాక్ట్ వస్తుంది. ఆ విషయం తెలిసి మందు తాగి పనికి వెళ్తాడు. రాధాకృష్ణ ను తీసుకు వెళ్లిన వాళ్ళు ఒక చీకటి గదిలో బంధిస్తారు. నిజానికి అక్కడ చాలామంది తాగుబోతులు ఉంటారు. ఆల్కహాల్ కి బానిస అయిన వాళ్లను అక్కడ ఉంచుతారు. వసుంధర కొంతమంది అధికారుల దగ్గర మొర పెట్టుకోవడంతో, అతన్ని వాళ్ళు పని ఉందని చెప్పి తీసుకెళ్తారు. అయితే అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు రాధాకృష్ణ. మళ్లీ మందు తాగడం మొదలు పెడతాడు. రాధాకృష్ణతో వసుంధర విసిగిపోయి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంతలో మద్యం తాగుతున్నప్పుడు తన స్నేహితుడు రక్తం కక్కుకొని చనిపోతాడు. అప్పుడు రాధాకృష్ణకి భయం మొదలవుతుంది. చివరికి రాధాకృష్ణ మద్యం మానేస్తాడు? భార్య పిల్లలతో కలసి ఉంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాటిల్ రాధ’ (Bottle Radha) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.