E-Paper
Advertisement

PCB – ICC: పాకిస్థాన్ కు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీలో పేరు తొలగింపు ?

PCB – ICC: పాకిస్థాన్ కు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీలో పేరు తొలగింపు ?
Advertisement

PCB – ICC: 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఫిబ్రవరి 19 నుండి తెరలేచింది. చివరిసారిగా 2017 లో జరిగిన ఈ టోర్నీలో టీమిండియాను ఓడించి.. పాకిస్తాన్ టైటిల్ సాధించింది. అదే పాకిస్తాన్ ఇప్పుడు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతాపరమైన కారణాలతో భారత్.. పాకిస్తాన్ కి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో భారత్ కి సంబంధించిన మ్యాచులు దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఓ ఐసిసి టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి.

 

Advertisement

ఇలా చాలా కాలం తర్వాత ఓ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడంతో గంతులు వేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.. భారత్ తో కయ్యానికి దిగి లేకపోని సమస్యలు తెచ్చుకుంది. భారత్ పై ఎప్పుడు దురుద్దేశంతో వ్యవహరించే పాకిస్తాన్.. ఈ మెగా టోర్ని ప్రారంభ సమయంలో మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పాకిస్తాన్ లోని కరాచీ జాతీయ స్టేడియంలో భారత జాతీయ జెండాకు చోటు ఇవ్వలేదు. దీంతో అందరూ పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వెంటనే పాకిస్తాన్.. భారత జాతీయ జెండాను ఏర్పాటు చేసింది.

ఇక అప్పటినుండి పాకిస్తాన్ ని నిద్రపోనివ్వడం లేదు భారత్. తాజాగా మరో కాంట్రవర్సీకి తెరలేచింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న భారత్ – పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా ఆసక్తికర పోరు జరగనుంది. సెమిస్ చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. పాకిస్తాన్ కి ఇది చావో రేవో మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఓడిపోతే పాకిస్తాన్ ఇంటిదారి పట్టాల్సిందే. ఈ క్రమంలో టీమిండియాను ఎలాగైనా ఓడించి తీరాలని పాకిస్తాన్ భావిస్తోంది.

Advertisement

తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం, భారత్ తో జరిగే మ్యాచ్ కి పాకిస్తాన్ జట్టు ఓపెనర్ ఫకర్ జమాన్ లాంటి క్వాలిటీ బ్యాటర్ గాయంతో దూరం కావడం, ఉన్న ఆటగాళ్లు సరిగ్గా రాణించలేకపోవడంతో పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈ తరుణంలో భారత్ నుంచి ఆ జట్టుకు గట్టి షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఓటమిలో ఉన్న ఆ జట్టుపై పుండు మీద కారం చల్లినట్లు ఇన్ డైరెక్ట్ గా రెచ్చగొడుతుంది భారత్.

ఇందుకు ఉదాహరణ భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ అని చెబుతున్నారు. ఈ మ్యాచ్ బ్రాడ్ కాస్టింగ్ లో పాకిస్తాన్ పేరు లేకపోవడంతో పిసిబి తట్టుకోలేక పోయింది. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఆతిథ్యదేశంగా ఉన్నందున.. భారత మ్యాచులు దుబాయిలో జరిగినా సరే పాకిస్తాన్ పేరును లైవ్ బ్రాడ్ కాస్టింగ్ లో వాడాలి.

 

కానీ భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో లైవ్ ఫీడ్ లో ఎడమవైపున ఛాంపియన్స్ ట్రోఫీ అనే లోగో మాత్రమే కనిపించింది. ఇందులో పాకిస్తాన్ పేరు లేకపోవడంతో.. లోలోపల కుమిలిపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో కలెక్ట్ అయిన ఐసీసీ.. ఈ తప్పు మరోసారి రిపీట్ కాదని క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి పాకిస్తాన్ ని భారత్ నిద్రపోనివ్వడం లేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×