Tollywood….టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చేసేది చిన్న సినిమాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అందుకే నవీన్ చంద్ర సినిమాలు అంటే కచ్చితంగా ఏదో ఒక కంటెంట్ ఉంటుంది అని ఆడియన్స్ లో కూడా భావన కలిగింది. ఈ నేపథ్యంలోనే నవీన్ చంద్ర నుంచి వచ్చే ప్రతి సబ్జెక్టు కూడా ప్రేక్షకులకు వినూత్నమైన వినోదాన్ని ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుందనటంలో సందేహం లేదు. ఇకపోతే నవీన్ చంద్ర తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం “లెవెన్”. లోకేష్ అజ్ల్స్ దర్శకత్వంలో ఈ సినిమాను అజ్మల్ ఖాన్, రేయాహరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ విడుదల అవ్వగా.. ఈ సినిమా కోసం శృతిహాసన్ (Shruti Hassan) పాడిన “ది డెవిల్ ఈజ్ వెయిటింగ్” పాటను మేకర్స్ రిలీజ్ చేయగా.. దీనికి మంచి ఆదరణ కూడా లభించింది. ఇప్పుడు మరో పాటను ఈ చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ పాటను ఆండ్రియా జెరేమియా (Andrea Jeremiah ) పాడడమే కాకుండా అందులో పెర్ఫార్మ్ కూడా చేశారు. ముఖ్యంగా ఆండ్రియా డాన్స్ పెర్ఫార్మెన్స్ కి కచ్చితంగా కుర్రకారు ఫిదా అవుతారని ఆడియన్స్ చిత్ర బృందం చెబుతోంది. ఏది ఏమైనా ఈ విషయం తెలిసి.. నిన్న శృతిహాసన్.. నేడు ఆండ్రియా.. నవీన్ చంద్ర డిమాండ్ మామూలుగా లేదుగా అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకి డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన “ఇక్కడ రా..” అనే పాటను రాకేందు మౌళి రాయగా.. సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇందులో రిత్విక, అభిరామి, దిలీపన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
నవీన్ చంద్ర బాల్యం, విద్యాభ్యాసం..
నవీన్ చంద్ర విషయానికి వస్తే.. బళ్లారిలోని దేవి నగర్ లో ఒక తెలుగు కుటుంబంలో 1982 డిసెంబర్ మూడవ తేదీన జన్మించారు. ఈయన తండ్రి కేఎస్ఆర్టీసీలో హెడ్ మెకానిక్ గా పని చేస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన నవీన్ చంద్ర సినిమాలోకి రాకముందు మల్టీమీడియా యానిమేటర్ గా కూడా పనిచేయడం గమనార్హం.
ALSO READ:Sanam Shetty.. ఛాన్స్ అడిగితే ప*క్కలోకి రమ్మంటారు..!
సినిమా కెరియర్..
ఇక 2006లో అంజి అనే రంగస్థలం పేరుతో ‘సంభవామి యుగేయుగే’ అనే చిత్రంతో తెలుగు హీరోగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత చందు అనే రంగస్థలం పేరుతో కళ్యాణం చిత్రంలో కూడా నటించిన ఈయన ఇక తెలుగు మాత్రమే కాదు తమిళ్లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నవీన్ చంద్ర హీరోగానే కాకుండా పలు సినిమాలలో కీలకపాత్రలు కూడా పోషిస్తున్నారు. నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తి సురేష్(Keerthy Suresh) లీడ్రోల్ పోషించిన ‘మిస్ ఇండియా’లో కూడా కనిపించారు. అంతేకాదు 2023లో విడుదలైన మంత్ ఆఫ్ మధు, జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలలో కీలక పాత్రలు పోషించిన ఈయన యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న లెవెన్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక ఈ ఏడాది రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో కూడా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.