OTT Movie : టీనేజ్ లో పిల్లలు మార్పులకు గురవుతూ ఉంటారు. ఆ సమయంలో తల్లిదండ్రుల గైడెన్స్ పిల్లలకు చాలా అవసరం అవుతుంది. చాలా విషయాలు తల్లిదండ్రులకు, పిల్లలు చెప్పుకోకపోవడం వలనే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ, ఆకర్షణకి తేడా తెలియని వయసులో కొన్ని పరిస్థితులను టీనేజర్స్ అధిగమించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో చదువుకునే ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడి, ఎదుర్కొన్న సమస్యలతో స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళ్తే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ అస్సామీ డ్రామా మూవీ పేరు ‘బుల్బుల్ కెన్ సింగ్‘ (Bulbul can sing). ఈ మూవీకి రీమా దాస్ దర్శకత్వం వహించారు. ఇది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కాంటెంపరరీ వరల్డ్ సినిమా విభాగంలో ప్రదర్శించబడింది. ముగ్గురు టీనేజర్ల చుట్టూ ఈ ‘బుల్బుల్ కెన్ సింగ్’ మూవీ తిరుగుతుంది. ఆకతాయిల వల్ల ఆడపిల్లల జీవితాలు ఎలా మారిపోతాయో ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
బుల్బుల్, మెగా, బన్నీ ముగ్గురు మంచి స్నేహితులు. ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్ కి వెళ్లి చదువుకుంటూ ఉంటారు. ఇందులో బుల్బుల్, మెగా అమ్మాయిలు కాగా బన్నీ స్వలింగ సంపర్కుడిగా ఉంటాడు. బుల్బుల్ తండ్రి పాటలు పాడుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ పాటలను బుల్బుల్ కి కూడా నేర్పిస్తాడు. అయితే ఈ అమ్మాయిలు ఇద్దరూ స్కూల్ కి వెళ్ళే రోజుల్లోనే ప్రేమలో పడతారు. ఈ రెండు జంటలు ఒకరిని ఒకరు బాగా ఇష్టపడుతూ సమయం గడుపుతుంటారు. ఒకరోజు ఈ ప్రేమ పక్షులు పొదలు చాటున మాట్లాడుకుంటుండగా, బన్నీ బయట కాపలాగా ఉంటాడు. ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వమని చెప్పి వెళతారు ఈ ప్రేమ జంటలు. అయితే బన్నీ ఒంటరిగా ఉండడంతో, ఇక్కడ ఎందుకున్నావని బెదిరిస్తారు ఆకతాయిలు. ఆక్కడినుంచి బన్నీ సిగ్నల్ ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. అయితే అదే సమయంలో పొదలచాటున చప్పుడు రావడంతో, ఇది చూసిన ఆకతాయిలు ఆ ప్రేమ జంటలను బాగా ఏడిపిస్తారు.
వీళ్లందరిని వీడియో తీసి వైరల్ కూడా చేస్తారు ఆకతాయిలు. దాంతో ఇంట్లో, స్కూల్లో ఈ అమ్మాయిలకు గట్టిగా వార్నింగ్ ఇస్తారు పెద్దలు. ఆ తర్వాత వీళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి. మెగా ఈ పని చేసినందుకు, ఆమె తల్లి చాలా బాధ పడుతూ ఉంటుంది. తల్లి బాధను చూడలేక మెగా ఒకరోజు ఇంట్లోనే ఉరివీసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. తన స్నేహితురాలు మరణంతో బుల్బుల్ మరింతగా బాధపడుతుంది. చివరికి బుల్బుల్ ఈ ఘటన నుంచి బయటపడుతుందా? వీళ్ళ ప్రేమ అంతటితో ముగిసిపోతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బుల్ బుల్ కెన్ సింగ్’ (Bulbul can sing) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.