Chandoo Mondeti: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల్లో చందు మోండేటి ఒకడు. దర్శకుడిగా పరిచయమయిన తర్వాత చందు తెరకెక్కించింది తక్కువ సినిమాలే అయినా అవన్నీ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలా తనకు మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్‌గా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ‘తండేల్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నాడు చందు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ లాంచ్ జరిగింది. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టేజ్‌పైనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు చందు మోండేటి.
చైతూ కోసం అమీర్
‘తండేల్’ (Thandel) మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు అల్లు అరవింద్. అందుకే ఈ సినిమాను కేవలం ఒకే భాషలో కాకుండా హిందీతో పాటు ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ప్రతీ భాషా ప్రేక్షకుల దగ్గరకు స్వయంగా వెళ్లి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అంతే కాకుండా ‘తండేల్’ను అన్ని భాషల్లో ప్రమోట్ చేయడానికి ఇతర హీరోల సాయం కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను తమిళంలో లాంచ్ చేయడం కోసం కార్తి రంగంలోకి దిగాడు. దాంతో దీనికి తమిళంలో సరిపడా ప్రమోషన్స్ జరిగాయి. ఇప్పుడు దీని హిందీ ట్రైలర్ లాంచ్ కోసం ఏకంగా అమీర్ ఖాన్‌ను రంగంలోకి దించారు మేకర్స్.
టెన్షన్‌గా ఉంది
‘తండేల్’ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. ముంబాయ్‌లో ఈ జరిగిన ఈ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు చందు మోండేటి, హీరో నాగచైతన్య, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు హాజరయ్యారు. ఇక దీనికి చీఫ్ గెస్ట్‌గా అమీర్ ఖాన్ (Aamir Khan) వచ్చాడు. తనను చూసిన తర్వాత నోట మాట రావడం లేదంటూ సంతోషం వ్యక్తం చేశాడు చందు మోండేటి. ‘‘వచ్చినందుకు థాంక్యూ అమీర్ సార్. నాకు చాలా టెన్షన్‌గా ఉంది. మీరు నా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు అన్నదానికంటే మీతో స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను అన్నదే మరింత ఎగ్జైటింగ్‌గా ఉంది. నేను ఒక స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కానీ మిమ్మల్ని చూడగానే మర్చిపోయాను’’ అని చెప్పుకొచ్చాడు చందు.
Also Read: అమీర్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ నే కమిట్మెంట్ అడిగిన టాలీవుడ్ నిర్మాత.. ?
పనివ్వండి ప్లీజ్
‘‘మీరు 6 నెలలు అసిస్టెంట్‌గా పనిచేయనిస్తారా? ఇది నా రిక్వెస్ట్. మీ తరువాతి సినిమాకు మిమ్మల్ని అసిస్ట్ చేయాలని ఉంది. అసిస్టెంట్‌గా ఉండడం అయిపోయిన తర్వాత మీకొక కథ చెప్తాను. నాకు నిజంగా మీతో కలిసి పనిచేయాలని ఉంది. మీరు సినీ పరిశ్రమకు పెద్దబాలశిక్ష లాంటివారు. నేను దీనిని ఊహించుకొని చెప్పడం లేదు. ఇది నా నిజమైన ఫీలింగ్’’ అంటూ అమీర్ ఖాన్‌ను ప్రశంసలతో ముంచేశాడు చందు మోండేటి (Chandoo Mondeti). ఇక ‘తండేల్’ ట్రైలర్‌కు తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగుతో పాటు హిందీ భాషల్లో కూడా ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమయ్యింది.