Brahmamudi serial today Episode: రాజ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ తనకు వీసా కావాలని.. తన భార్య కావ్యకు వీసా, పాస్‌ఫోర్టు కావాలని చెప్తుంటాడు. వెనక నుంచి రుద్రాణి వింటుంది. ఇదేదో ఉన్నదంతా ఊడ్చుకుని విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా ఏంటి అని కంగారు పడుతుంది. రాజ్ రూంలోకి చూడగానే.. కావ్య స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తీసుకుని నేర్చుకుంటుంటే.. రుద్రాణి వెళ్లి ఈ టెన్షెస్ చాలు కానీ నాకో డౌటు ఉంది క్లారిటీ ఇస్తావా.. అసలు నువ్వేం చేస్తున్నావు.. .. అని అడుగుతుంది. మీటింగ్ లలో మాట్లాడాలి అంటే ఇగ్లీష్ రావాలి కదా..? అంటుంది కావ్య. ఈ బుక్ చదివి ఇంగ్లీష్ నేర్చుకుంటావా అని అడుగుతుంది. ఈ బుక్కులో ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయి. అని చెప్పగానే.. రుద్రాణి కన్ఫం రూపాయలలో ఉన్న ఆస్థిని డాలర్లలోకి మార్చి విదేశాలకు చెక్కేస్తున్నారు అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లి ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది.
ధాన్యలక్ష్మీ నువ్వు ఇక్కడు ఉన్నావా..? నీకో ముఖ్యమైన విషయం చెప్పలి.. ఈ ఇంట్లో చీమ చిటుక్కుమన్నా నువ్వు దాన్ని ముఖ్యమైన విషయంగానే చెప్తావు కదా..? అంటుంది ధాన్యలక్ష్మీ.. ఈ చిన్నచూపే వద్దన్నది అంటుంది రుద్రాణి. ఇందులో చిన్నచూపు ఏముంది. ఇంతకీ ఏం మోసుకొచ్చావో చెప్పు.. అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. మోసుకురాలేదు. నువ్వు షాక్ అయ్యే వార్తను నా చెవులారా విని.. కళ్లారా చూసి చేతులారా తీసుకొచ్చాను అని చెప్తుంది రుద్రాణి. ధాన్యలక్ష్మీ ఏం విషయం అది అని అడుగుతుంది. రుద్రాణి.. ఇన్నాళ్లు రాజ్, కావ్య ఈ ఆస్థిని ఏం చేస్తున్నారో అన్న సందేహంతో ఉన్నాం కదా.. దానికి ఈరోజు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆస్థిని మొత్తం కరిగించేసి డాలర్ల రూపంలోకి మార్చేశారు అని రాజ్ మాట్లాడింది.. కావ్య ఇంగ్లీష్ నేర్చుకున్నది చెప్తుంది. వాళ్లు ఏం మాట్లాడుకున్నా..? నువ్వు అర్థం చేసుకున్నదే మోసుకొచ్చి నాకు చెప్తావు. నన్ను బకరాను చేస్తావు అంటుంది ధాన్యలక్ష్మీ. నన్ను ఎక్కువగా రెచ్చగొట్టే పనులు చేయకుండా వేరే పనులు ఉంటే చేసుకో అని చెప్పి వెళ్లిపోతుంది.
పాస్‌ఫోర్టు, వీసా కోసం ఏజెంట్ ఫోన్ చేస్తే.. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడికి రావాలి అని అడుగుతాడు. ఇంటికి రమ్మని చెప్తాడు. ఏంటండి మనం ఆఫీసుకే వెళ్తున్నాము కదా..? అక్కడికే రమ్మని చెప్పొచ్చు కదా అంటుంది కావ్య. మనం ఆఫీసు నుంచి బ్యాంకుకు వెళ్తున్నాం అందుకే ఇక్కడికి రమ్మన్నాను అని చెప్తాడు రాజ్. మరి ఇక్కడ ఎవరు డాక్యుమెంట్స్ ఇస్తారు అని కావ్య అడగ్గానే.. స్వప్న ఉంది కదా..? తనకు డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్దాం అని కిందకు వచ్చి స్వప్నకు డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్లిపోతారు.
కళ్యాణ్ తన రైటర్ దగ్గరకు వెళ్లి తాను రాసిన సాంగ్‌ను ఇస్తాడు. సాంగ్ చూసిన రైటర్ అద్బుతంగా ఉందని కళ్యాణ్‌ను మెచ్చుకుంటాడు. ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్ రాగానే మీకు కావాల్సిన సాంగ్ రాశాను అని కళ్యాణ్ ఇచ్చిన సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌కు ఇస్తాడు. సాంగ్ బాగుందని మ్యూజిక్ డైరెక్టర్ మెచ్చుకుంటాడు. ఇది మీరు రాసిందేనా అంటూ అనుమానంతో అడుగుతాడు. నేను రాశాను యూత్ కోసం నా స్టైల్ మార్చాను అంటాడు రైటర్.
కారులో వెళ్తున్న రాజ్, కావ్యను ఏంటి నిన్నటి నుంచి ఇంగ్లీష్‌తో చాలా కుస్తీ పడుతున్నావు.. ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడు. చిన్నప్పుడు మా పెద్దమ్మ చెప్పిన సామెతలను ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్ లోకి చేస్తున్నాను.. నేను ఇంగ్లీష్ సామెతలు చెప్తాను. మీరు తెలుగులో చెప్పండి అని అడుగుతుంది కావ్య. ఏంటి నాకు ఇంగ్లీష్‌లో టెస్ట్ పెడతావా..? సరే అడుగు అంటాడు రాజ్. దీంతో కావ్య డస్ట్ ఇన్ డైమండ్ అనగానే రాజ్ ఆశ్చర్యంగా చూడగానే.. మట్టిలో మాణిక్యం అంటుంది. ఇలాంటి సామెతలు చెప్తుంటే.. రాజ్ ఆపు ఇక ఆపు దయచేసి ఇలాంటి సామెతలు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేయకు అంటాడు. ఇంతలో రాజ్‌కు ఎస్సై ఫోన్ చేసి మర్డర్ చేసిన వాడి బైకు నెంబర్ ప్లేట్ ఫేక్ అని చెప్తాడు. దీంతో రాజ్ ఆలోచనలో పడిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?