OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే కాస్త భయంతో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ సినిమాలలో ఉండే కొంతమంది సైకోలు, తీవ్రమైన హింసతో మనుషుల్ని భయపెట్టిస్తుంటారు. అలా భయపెట్టే మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….
ప్లెక్స్ (Plex) లో
ఈ సైకో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కాన్నిబెల్‘(Cannibal). ఈ మూవీకి మాన్యుయెల్ మార్టిన్ కుయెంకా దర్శకత్వం వహించారు.
ఈ మూవీని MOD ప్రొడక్షన్స్, లిబ్రా ఫిల్మ్, లూమినార్ కలసి నిర్మించారు. మనిషి మాంసానికి అలవాటు పడ్డ ఒక వ్యక్తి, జాలి కనికరం లేకుండా అమ్మాయిల మాత్రమే చంపి, ఆ మాంసాన్ని తింటూ బతుకుతాడు. ఈ సైకో చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ప్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
కార్లోజ్ జనసంచారంలోనే ఉంటూ నరమాంసానికి అలవాటు పడతాడు. అయితే ఇతడు అమ్మాయిల మాంసాన్ని మాత్రమే తింటూ ఉంటాడు. ఆకలి వేసినప్పుడు అమ్మాయిలను చంపి ఫ్రిజ్లో పెట్టుకుని తింటాడు. ఆ మాంసం అయిపోయాక మళ్లీ వేట ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో కార్లోజ్ ఇంటి పక్కన అలెగ్జాండ్రా అనే అమ్మాయి ఉంటుంది. ఇంట్లో గొడవపడి ఒంటరిగా ఉండే, ఈ అమ్మాయిని చూసి కార్లోజ్ మాటలు కలుపుతాడు. ఆమెను కూడా చంపి తినాలనుకుంటాడు. ఒకరోజు అలెగ్జాండ్రా, కార్లోజ్ ఇంటికి వస్తుంది. అతని ఫ్రిడ్జ్ లో ఎక్కువ మాంసం చూసి ఆశ్చర్య పోతుంది. ఇంత మాంసం నువ్వు ఒక్కడివే తింటావా అని అడుగుతుంది. అయితే అది మనిషి మాంసమని గుర్తుపట్టకపోవడంతో, కార్లోజ్ ఊపిరి పీల్చుకుంటాడు. ఆ తరువాత రోజు ఈమెను కూడా చంపి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాడు. ఆ తర్వాత అక్కడికి అలెగ్జాండ్రా చెల్లెలు వస్తుంది. తన అక్క కనిపించట్లేదని కార్లోజ్ ని అడుగుతుంది. కార్లోజ్ తనకేమీ తెలియదని ఆమెకు చెప్తాడు. మీరు మా అక్కను వెతకడానికి ఏదైనా సహాయం చేయమని అడుగుతుంది.
కార్లోజ్ అలాగే అని చెప్పి ఒక ఉడెన్ హౌస్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఆమెకు తినే అన్నంలో మత్తు కలుపుతాడు. మత్తులోకి వెళ్లాక ఆమెను చంపి తినాలనుకుంటాడు. అయితే కార్లోజ్ ఆ పని చేయలేకపోతాడు. ఎందుకంటే కార్లోజ్ ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కార్లోజ్ కారులో తిరిగి వస్తుండగా ఆమెకు నిజం చెప్పేస్తాడు. మీ సిస్టర్ ని నేనే చంపి తినేసానని, నిన్ను కూడా చంపడానికే, ఇక్కడికి తీసుకు వచ్చాను అని చెప్తాడు. మొదట హీరోయిన్, కార్లోజ్ జోక్ చేస్తున్నాడు అనుకుంటుంది. అది నిజమని తెలిశాక ఒక డెసిషన్ తీసుకుంటుంది. చివరికి హీరోయిన్ కార్లోజ్ ని ఏం చేస్తుంది? కార్లోజ్ చేతిలో హీరోయిన్ చనిపోతుందా? మనిషి మాంసాన్ని తినే అలవాటును కార్లోజ్ మానుకుంటాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ‘కాన్నిబెల్'(Cannibal) అనే ఈ సైకో థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.