E-Paper
Advertisement

రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!

రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!
Advertisement

Malka Komaraiah: స్వేచ్ఛ బ్యూరో : బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య రామాయంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై, వారి విద్యాభ్యాసం, పాఠశాలల్లో అందుతున్న విద్యాబోధన, ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలల్లోని మౌలిక వసతులు, విద్యా సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను ఎమ్మెల్సీ పరిశీలించారు.

వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి..

Advertisement

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మల్క కొమరయ్య పేర్కొన్నారు. పాఠశాలల్లో తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు.

పీఆర్సీ ప్రకటించి వెంటనే అమలు చేయాలి

Advertisement

ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్ చేశారు. మంగళవారం టీపీయూఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మల్క కొమరయ్య మాట్లాడుతూ.. పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని, సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ను అమలు చేయాలని కోరారు. అలాగే జీవో 25ను సవరించాలని, జీవో 190ను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు కేవలం ఉద్యోగ సంబంధిత అంశాలు మాత్రమే కాదని, అవి విద్యావ్యవస్థ నాణ్యతతో నేరుగా ముడిపడి ఉన్నాయని మల్క కొమురయ్య అన్నారు. ఉపాధ్యాయులకు న్యాయం జరిగినప్పుడే వారు మరింత అంకితభావంతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దగలరని పేర్కొన్నారు.

Also Read: సైలెంట్‌గా గులాబీ సర్వేలు.. ఖైరతాబాద్, ఎమ్మెల్సీ పోరుపై ముందస్తు వ్యూహం!

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ అగ్నిప్రమాదం!

8. జెప్టో డెలివరీ కార్మికుడిపై దాడి.. చర్యలకు TGPWU డిమాండ్

మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్

కేబీఆర్ పార్కు చుట్టూ భారీగా మార్పులు.. జీహెచ్‌ఎంసీ మరో బిగ్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

సైలెంట్‌గా గులాబీ సర్వేలు.. ఖైరతాబాద్, ఎమ్మెల్సీ పోరుపై ముందస్తు వ్యూహం!

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్లబంగారం.. నల్లగొండలో 80 శాతం పత్తిపంట నష్టం!

ఇందిరమ్మ ఇళ్లు పథకం పేరుతో భూ కబ్జా.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు!

Big Stories

Advertisement
×