OTT Movie : ఓటీటీ లో ఇప్పుడు ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు హడావిడి చేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇటువంటి వెబ్ సిరీస్ లు, సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకున్నాయి. ప్రేక్షకులు కూడా వీటికి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు తగ్గట్టే స్టోరీలను దర్శకులు ప్రజెంట్ చేస్తున్నారు .ఇప్పుడు మనం చెప్పుకోబోయే కన్నడ సినిమా, సస్పెన్స్ తోనే చివరివరకు పిచ్చెక్కిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ కన్నడ థ్రిల్లర్ మూవీ పేరు ‘కేస్ ఆఫ్ కొండన’ (Case of Kondana). 2024 లో విడుదలైన ఈ మూవీకి దేవీ ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ రాఘవేంద్ర, భావన మీనన్, కుషీ రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బెంగళూరు శివారులోని ఒక కొండన అనే ప్రదేశంలో, ఒకే రాత్రి జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక హైపర్‌లింక్ నరేటివ్‌ను అనుసరిస్తుంది. ఇందులో నాలుగు వేర్వేరు కథాంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో మార్చి 28, 2024 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
బెంగళూరు శివారులోని కొండన అనే ప్రాంతంలో ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) విల్సన్ కొత్తగా విధుల్లో చేరుతాడు. అయితే మొదటి రోజే తనకి ఉన్న కోపం వల్ల రౌడీలతో గొడవపడతాడు.విల్సన్ సహన అనే ఒక డాక్టర్‌తో ప్రేమలో ఉంటాడు. కానీ ఆమె సోదరుడు వారి ప్రేమను వ్యతిరేకిస్తుంటాడు. అదే సమయంలో విల్సన్ తన పోస్టింగ్ కోసం లంచం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దానికి అతను ఇంకా డబ్బు సమకూర్చలేకపోతాడు. మరోవైపు, ACP లక్ష్మి వరుసగా హత్యలు చేస్తూ, దొంగతనాలు కూడా చేస్తున్న ఒక కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఆ కిల్లర్ పెళ్ళయిన వాళ్ళని టార్గెట్ చేసి చంపుతుంటాడు. ఇది ఆమె డిపార్ట్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారుతుంది. ఇంకో స్టోరీలో రాజు అనే వ్యక్తి పానీపూరి అమ్ముతూ ఉంటాడు. అనారోగ్యంతో అతని కుమారుడు బసంత్ బాధపడుతుంటాడు. అతన్ని రక్షించడానికి చాలా పాట్లు పడుతుంటాడు.
కానీ డబ్బు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు రాజు. ఒక రాత్రి ఈ వేర్వేరు పాత్రల జీవితాలు ఊహించని విధంగా కలుస్తాయి. విల్సన్ ఒక ఊహించని సంఘటనలో రాజును అనుకోకుండా చంపేస్తాడు. ఆ తర్వాత తన తప్పును దాచడానికి మరిన్ని తప్పులు చేస్తాడు. అదే కేసును విచారించే బృందంలో అతను కూడా భాగం అవుతాడు. ఇది స్టోరీ ఇప్పుడు మరొ లెవెల్ కి వెళ్తుంది. ఈ ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలు విల్సన్, లక్ష్మి, సహన, రాజు కుటుంబం ఇలా అందరి జీవితాలను మార్చేస్తాయి. చివరికి విల్సన్ తాను చేసిన తప్పుకు అరెస్ట్ అవుతాడా ? ఆ సీరియల్ కిల్లర్ దొరుకుతాడా ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూసేయండి. ఈ మూవీ వేగవంతమైన కథనం, బలమైన నటన, ఉత్కంఠభరితమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.