BigTV English

Pimples: ఏం చేసినా మొటిమలు తగ్గట్లేదా..? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి

Pimples: ఏం చేసినా మొటిమలు తగ్గట్లేదా..? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి

Pimples: ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడం వల్ల చాలా మందికి ముఖం మీద మొటిమలు(Pimples) వస్తాయి. మరికొందరికేమో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల కూడా పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో స్కిన్ నుంచి ఆయిల్ ఉత్పత్తి పెరిగినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా కారణంగా కూడా చాలా మందికి ముఖంపై మొటిమలు వస్తాయట.


వీటి వల్ల చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. మొటిమలను పోగొట్టుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పెద్దగా లాభం ఉండదు. అలాంటి సమయాల్లో కొన్ని సింపుల్ టిప్స్ సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండడం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం సాధ్యం అవుతుందని అంటున్నారు. మొటిమలు త్వరగా తగ్గిపోవాలంటే ఏం చేయాలంటే..

క్రీమ్‌, క్లెన్సర్‌:
మొటిమలను తగ్గించుకోవడానికి చాలా మంది క్రీమ్‌లు, క్లెన్సర్‌ని వాడతారు. అయితే ఇవి చర్మంపై ప్రభావం చూపడం పూర్తిగా మొదలుకాక ముందే వీటి వాడకాన్ని ఆపేస్తారు. దీని వల్ల ఎలాంటి లాభం ఉండదని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఏ క్రీమ్ అయినా సరిగా పని చేస్తుందా లేదా అనేది తెలియాలంటే కనీసం నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందట. కొన్ని ట్రీట్‌మెంట్స్ అయితే రెండు నుంచి నాలుగు వారాలు తీసుకుంటుంది. వెంటనే ఫలితం కనిపించాలంటే సాధ్యం కాదని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. అందుకే పూర్తి రిజల్ట్ కనిపించాలంటే కొంత సమయం వరకు వేచి ఉండాలని సూచిస్తున్నారు.


వాటర్:
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ నీళ్లు తాగడం అవసరం. నీరు తాగకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందట. దీంతో చర్మం పొడిబారిపోయే ఛాన్స్ ఉంది. దీని వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే శరీరానికి సరిపడా నీళ్లను తాగాలని డెర్మటాలజిస్ట్‌లు సూచిస్తున్నారు.

ALSO READ: బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల క్యాన్సర్..!

ఫాస్ట్ ఫుడ్:
ఫాస్ట్ ఫుడ్ తరచుగా తినేవారికి ఎక్కువగా పింపుల్స్ అవుతాయి. దీని నుంచి తప్పించుకోవడానికి ఏం చేసినా చాలా సార్లు ప్రయోజనం ఉండదు. అలాంటి సమయంలో ఫాస్ట్ ఫుడ్‌కి దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే షుగర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉందట. ఇప్పటికే మొటిమలు ఎక్కువగా ఉంటే వీటిని మితంగా తీసుకోవడం మంచిది.

ఫేస్ వాష్:
ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా మొటిమలు రాకుండా ఉంటాయట. అందుకే తరచుగా ముఖాన్ని కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల మొటిమలు రావడానికి కారణం అయ్యే నేచురల్ ఆయిల్స్ కూడా తొలగిపోతాయని అంటున్నారు. ఆరోగ్యవంతమైన చర్మం కోసం రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోవాలని సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×