BigTV English

OTT Movie : మర్డర్ ఉచ్చులో అడ్డంగా బుక్… పోలీసులతో భార్యాభర్తల దాగుడుమూతలు… ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : మర్డర్ ఉచ్చులో అడ్డంగా బుక్… పోలీసులతో భార్యాభర్తల దాగుడుమూతలు… ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : కొన్ని సినిమాలు థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఒటీటీలో మాత్రం టాప్ లేపుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. థియేటర్లలో డిసప్పాయింట్ చేసింది. అయితే ఒటీటీలో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఒక హత్య మిస్టరీ చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన కథ. ఇందులో ఒక పోలీసు అధికారి ఒక అంతుచిక్కని కేసును ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఆతరువాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి, ముఖ్యంగా సస్పెన్స్, ట్విస్ట్‌లతో కూడిన కథలను ఆస్వాదించే వారికి ఇది చూడదగిన సినిమా. ఫ్రెండ్స్‌తో కలిసి ఈ వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూడవచ్చు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘Chakravyuham: The Trap’ 2023లో విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీనిని చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించారు. సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌లో చెట్కూరి సావిత్రి నిర్మించిన ఈ చిత్రంలో అజయ్, జ్ఞానేశ్వరి కంద్రేగుల, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రజ్ఞా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల నటించారు. ఇది 2023 జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. 2023 జులై 5 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 2025 ఆగస్టు 1 నుండి ఆహా వీడియోలో తమిళంలో కూడా అందుబాటులో ఉంది. IMDbలో 7.1/10 రేటింగ్ ను పొందింది.


స్టోరీలోకి వెళితే

సిరి అనే ఒక గృహిణి, తన ఇంటిలో గొంతు కోసిన స్థితిలో చనిపోయి కనిపిస్తుంది. ఆమె భర్త సంజయ్ పని కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ హత్య జరుగుతుంది. ఈ కేసును ఇన్స్‌పెక్టర్ సత్య, ఎస్‌ఐ దుర్గా నాయక్ సహాయంతో ఛేదించడం ప్రారంభిస్తాడు. హత్య దొంగతనం లాగా కనిపించేలా ఉన్నప్పటికీ, అలాంటి ఆనవాళ్లు కనిపించవు. ఇక్కడే ఈ హత్య మీద సత్యకు అనుమానం కలుగుతుంది. ఈ ఇంటి నుండి ₹50 లక్షల డబ్బు, ₹50 లక్షల విలువైన బంగారం మాయమవుతాయి. దీనితో కేసు మరింత క్లిష్టంగా మారుతుంది. సత్య మొదట సంజయ్‌పై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఎందుకంటే సిరి తన ₹50 కోట్ల విలువైన తాతల ఆస్తిని అనాథాశ్రమానికి దానం చేయాలని నిర్ణయించుకుని ఉంటుంది. సంజయ్ దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Read Also : రోజుకో బ్యాంక్ కొల్లగొట్టే థీఫ్… సినిమా అంతా పరుగో పరుగు… మెంటలెక్కించే హీస్ట్ థ్రిల్లర్

అదే సమయంలో సంజయ్ స్నేహితుడు శరత్‌పై కూడా పోలీసులకు అనుమానం వస్తుంది. ఎందుకంటే సిరి హత్యకు కొన్ని వారాల ముందు అతనితో సీక్రెట్ గా ఎదో మాట్లాడి ఉంటుంది. అంతేకాకుండా సిరి ఇంట్లో పనిచేసే పనిమనిషి, మేనేజర్ మల్లిక్, సిరి తాత, తండ్రి శ్రీధర్ అనుమానితుల జాబితాలో ఉంటారు. ఈ సినిమా మొదటి 30 నిమిషాలు ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే, డైలాగులు, ఒక గొప్ప ఓపెనింగ్ సాంగ్‌తో ఎంట్రీ అదిరిపోతోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఈ స్టోరీ చివరి వరకూ ఇన్వెస్టిగేషన్ తో ఊహించని మలుపులతో సాగిపోతుంది. ఈ హత్య చేసింది ఎవరు ? ఎందుకు చేశారు ? ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది. అనే వివరాల్లోకి వెళితే …

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×