OTT Movie : యాక్షన్ చేజ్ సీన్స్ బలంగా కావాలనుకునే వాళ్లకి ఈ సినిమా ఒక చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ స్టోరీ ఒక వ్యక్తి డబుల్ లైఫ్‌ను చూపిస్తుంది. అతను ఒకవైపు మారథాన్‌లు గెలుస్తూనే, మరోవైపు బ్యాంక్‌లను దోచుకుంటుంటాడు. ఈ సినిమా ఉత్కంఠంగా ఉండే చేజ్ సీన్స్, ఆండ్రియాస్ లస్ట్ నటన, గ్రిప్పింగ్ స్టోరీ కారణంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇది యూరోపియన్ క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారికి ఒక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో
‘ది రాబర్’ (The Robber) 2010 లో వచ్చిన ఒక జర్మన్-ఆస్ట్రియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీనికి బెంజమిన్ హైసెన్‌బర్గ్ దర్శకత్వం వహించారు. టుబి, ప్లెక్స్ లలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇది మారథాన్ రన్నర్ జోహాన్ కాస్టెన్‌బర్గర్ జీవితం ఆధారంగా మార్టిన్ ప్రిన్జ్ రాసిన నవల నుండి తీసుకోబడింది. ఈ చిత్రంలో ఆండ్రియాస్ లస్ట్ (జోహాన్ రెట్టెన్‌బర్గర్), ఫ్రాంజిస్కా వైస్జ్ (ఎరికా), మార్కస్ ష్లీన్జర్ (పెరోల్ ఆఫీసర్), జోహాన్ బెడ్నర్ నటించారు.ఈ సినిమా 90 నిమిషాల నిడివితో, జర్మన్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఉంటుంది. ఇది రాటెన్ టొమాటోస్‌లో 78%, IMDbలో 6.7/10 స్కోర్ పొందింది.
స్టోరీలోకి వెళితే
జోహాన్ రెట్టెన్‌బర్గర్ (ఆండ్రియాస్ లస్ట్) ఒక ఆస్ట్రియన్ మారథాన్ రన్నర్. అతను గతంలో ఒక రాబరీ కేసులో ఆరు సంవత్సరాలు జైలులో గడిపాడు. జైలులో ఉన్నప్పుడు కూడా అతను రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. జైలు నుండి విడుదలైన వెంటనే, అతను మళ్లీ బ్యాంక్ రాబరీలు మొదలెడతాడు. మాస్క్ ధరించి, షాట్‌గన్‌తో బ్యాంక్‌లలోకి వెళ్లి, డబ్బును దోచుకుని, తన అద్భుతమైన రన్నింగ్ స్కిల్స్‌తో పోలీసుల నుండి తప్పించుకుంటాడు. అతను దోచిన డబ్బును తన బెడ్ కింద దాచుకుని, దాని గురించి పట్టించుకోకుండా ఉంటాడు. అతనికి డబ్బు కంటే రాబరీలు చేసే థ్రిల్, రన్నింగ్ మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. జోహాన్ తన పాత స్నేహితురాలు ఎరికా తో కలిసి జీవించడం మొదలెడతాడు. ఒక సోషల్ వర్కర్ అయినటువంటి ఎరికా, అతనితో రిలేషన్‌షిప్‌లోకి వస్తుంది. అతను మారథాన్‌లలో గెలుస్తూ, రికార్డులు సెట్ చేస్తూ, తన పెరోల్ ఆఫీసర్ నుండి ప్రశంసలు అందుకుంటాడు. కానీ అతని రాబరీలు మాత్రం కంటిన్యు అవుతుంటాయి.
Read Also : ఆన్‌లైన్ డేటింగ్… జీవితాలతో నెట్వర్క్ ఆడే డెడ్లీ గేమ్… సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్