BigTV English

Tamannah : నన్ను హింసించకండి.. ఒక్కసారి కనిపిస్తే పెళ్లి చేస్తారా? మిల్క్ బ్యూటి వార్నింగ్..

Tamannah : నన్ను హింసించకండి.. ఒక్కసారి కనిపిస్తే పెళ్లి చేస్తారా? మిల్క్ బ్యూటి వార్నింగ్..

Tamannah : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్క సినిమా తో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ మధ్య తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు కానీ బాలీవుడ్ లోనూ అటు తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత కొద్ది రోజులు తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ అందరికి షాకిస్తూ బ్రేకప్ చెప్పేసారు.. అయితే ఈమె మరొకరిని పెళ్లి చేసుకోబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపించేది. ఈ వార్తలపై తమన్నా సీరియస్ అయ్యింది..


పాక్ క్రికెటర్ తో పెళ్లి..?

తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపింది. కానీ ఏమైందో తెలియదు.. ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించేసారు. అయితే ఆమె ఒక క్రికెటర్ ను వివాహం చేసుకోబోతున్నారని, అది కూడా ఓ పాకిస్తాన్ క్రికెటర్ ను పెళ్లాడబోతోందంటూ గత కొంత కాలంగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తమన్నా తాజాగా స్పందించారు. గతంలో ఓసారి ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై తమన్నా స్పందించారు. పాకిస్తాన్ క్రికెటర్ తో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారనే ప్రచారాన్ని ఖండించారు.. ఏదో ఒక్కసారి అనుకోకుండా కలిస్తే పెళ్లి చేస్తారా? తాను ఎవరినీ పెళ్లి చేసుకోబోవడం లేదని పేర్కొంది. అబ్దుల్ రజాక్ తాను ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్నామని, అంతకుమించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది..


కోహ్లీతో ఎఫైర్.. 

గతంలో ఇండియన్ క్రికెటర్ కోహ్లీతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ పై కూడా గట్టిగానే క్లారిటీ ఇచ్చేసింది. తామిద్దరం ఒక యాడ్ లో కలిసి పని చేశామని.. దానికి ఇలాంటి వార్తలు రావడం బాధ కలిగించింది అని ఆవేదన చెందింది ఈ అమ్మడు. ఎవరితో కలిసి నటిస్తే వారితో దయచేసి పెళ్లి చెయ్యకండి అంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది. మొన్నటివరకు విజయ్ వర్మ తో పెళ్లి వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈమె పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో లేదట. కేవలం కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు చెప్పేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒకవైపు సినిమాలు.. మరోవైపు వరుసగా యాడ్లు చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది మిల్క్ బ్యూటీ..

Also Read : సోమవారం బోలెడు సినిమాలు..మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

సినిమాల విషయానికొస్తే.. 

తమన్నా ప్రస్తుతం సినిమాల పై ఫోకస్ చేసింది. వరుస సినిమాలతో బిజీగా మారెందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఓదెల 2 మూవీతో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే మరో సినిమాను అనౌన్స్ చేయబోతుందని సమాచారం..

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×