OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. ఇదివరకు సినిమాలు, సీరియళ్లకు అలవాటుపడ్డ ప్రేక్షకులు, ఇప్పుడు వెబ్ సిరీస్ లకు అతుక్కుపోతున్నారు. క్రైమ్, హారర్, కామెడీ అన్ని రకాల జానర్లలో ఈ వెబ్ సిరీస్ లు అలరిస్తున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక వెబ్ సిరీస్ ఓటిటిలో సందడి చేస్తోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ వెబ్ సిరీస్ పేరు ‘చిదియా వుడ్‘ (Chidiya UDD). కమాతిపురాలోని రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిల అక్రమ రవాణాతో స్టోరీ నడుస్తుంది. ఈ వెబ్ సిరీస్ కి రాజీవ్ జాదవ్ దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరోయిన్ ఒక మారుమూల గ్రామంలో ఏకాంత పనులు చేస్తూ ఉంటుంది. ఆమె పై ఆ ఊరి పెద్దమనిషి కన్ను పడుతుంది. ఆమెను తన మనుషులతో బలవంతంగా తన దగ్గరకు రప్పించుకుంటాడు. ఆమెతో ఆ పని చేయబోతుండగా, తనకి ఇష్టం లేకుండా అతను రావడంతో అతడిపై దాడి చేస్తుంది. ఇంతలోనే ఆ పెద్దమనిషి స్పృహ లేకుండా పడిపోతాడు. వాళ్లు గ్యాంగ్ స్టర్ లు కావడంతో, హీరోయిన్ తల్లి తనని రాజు అనే వ్యక్తితో ముంబైకి పంపిస్తుంది. రాజు అనే వ్యక్తి ముంబైకి అమ్మాయిలను బలవంతంగా సప్లై చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ ని కూడా అక్కడికి తీసుకువెళ్తాడు. ముంబైలోని కమాతిపురాలోని ఒక ప్రాంతం ఖాదీర్ అనే వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తూ, డబ్బులు బాగా సంపాదిస్తుంటాడు ఖాదీర్. ఇతని దగ్గరికి కొంతమంది వచ్చి, అమ్మాయిలను వేలంపాట పడుకొని తీసుకు వెళుతుంటారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన హీరోయిన్ ను చూసి ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
తను అంత అందంగా లేకపోవడంతో, వేలం పాటలో తనని కొనకపోవడంతో చాలా బాధపడుతుంది. ఎప్పటికైనా కామాటిపురాన్ని వెళ్తానంటూ శపధం చేస్తుంది. హీరోయిన్ ను అక్కడే పని చేసుకుని సత్తార్ అనే వ్యక్తి ఇష్టపడుతుంటాడు. ఆమె ఎవరితోనైనా గడుపుతుంటే బాధపడుతుంటాడు. ఇంతలో అక్కడ ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండా పోతారు. వాళ్లను చంపడానికి గ్యాంగ్స్టర్లు వెతుకుతూ ఉంటారు. వాళ్లను కాపాడే ప్రయత్నంలో హీరోయిన్ చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. మరోవైపు ఊర్లో హీరోయిన్ కోసం గ్యాంగ్ స్టర్ లువెతుకుతూ ఉంటారు. చివరికి హీరోయిన్ కామాటిపురాన్ని ఏలుతుందా? గ్యాంగ్ స్టర్ల చేతిలో బలవుతుందా? సత్తార్ ని హీరోయిన్ ప్రేమిస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘చిదియా వుడ్’ (Chidiya UDD) అనే ఈ వెబ్ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.