Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 31న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. రావలసిన ధనం చేతికందడంలో ఆలస్యం అవుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.
మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంట్లో కొందరి మాటలు మానసికంగా చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు దూరప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
సింహ రాశి: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అదనపు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.
కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
తులా రాశి: ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
ధనస్సు రాశి: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. దాయాదులతో స్థిరాస్తి తగాదాలు ఉంటాయి. సంతానం విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.
మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు భూ క్రయ విక్రయాలు నిరుత్సాహ పరుస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఇతరుల నుండి విమర్శలు తప్పవు. వృధా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు భూ సంభందిత వ్యవహారాలలో తగాదాలు చికాకు పరుస్తాయి. సంతానంతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆర్ధిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు నుండి ఒత్తిడి పెరుగుతుంది.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?