OTT Movie : ఇప్పుడు సినిమాలు తో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఓటిటిలో హల్చల్ చేస్తున్నాయి. వెబ్ సిరీస్ లు డైరెక్ట్ గానే ఓటీటి లోకి vache చేస్తున్నాయి. వీటికి సెన్సార్ నిబంధనలు కూడా లేకపోవడంతో మసాలా ఓ రేంజ్ లో చూపిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ముంబై రెడ్ లైట్ ఏరియాలో జరుగుతుంది. అక్కడ వ్యభిచార వృత్తిలో అమ్మాయిలు పడే వేదన ను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే
యం ఎక్స్ ప్లేయర్ (MX Player) లో
ఈ హిందీ వెబ్ సిరీస్ పేరు ‘ఉడ్ చిడియా ఉడ్’ (Chidiya Udd). 2025లో విడుదలైన ఈ వెబ్ సిరీస్, రాజస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల సెహర్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ ముంబై అండర్‌వరల్డ్, రెడ్-లైట్ జిల్లా మధ్య జరిగే సంఘటనలతో ముందుకు వెళ్తుంది. దీనికి రవి జాదవ్ దర్శకత్వం వహించారు. అబిద్ సుర్తి రాసిన ‘Cages’ అనే నవల ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. నిజ జీవిత సంఘటనల నుండి వెబ్ సిరీస్ ప్రేరణ పొందింది. సెహర్ పాత్రలో భూమిక మీనా నటించగా, జాకీ ష్రాఫ్, సికందర్ ఖేర్, మిత వశిష్ఠ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ వెబ్ సిరీస్ లో సెహర్ తన స్వేచ్ఛ కోసం పోరాడుతూ, సమాజం, వ్యక్తిగత బాధలను అధిగమించే ప్రయత్నం చేస్తుంది. ఎనిమిది ఎపిసోడ్ లతో ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ యం ఎక్స్ ప్లేయర్ (MX Player) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సెహర్ అనే అమ్మాయి రాజస్థాన్ లో ఒక గ్రామీణ ప్రాంతంలో సెక్స్ వర్కర్ గా పనిచేస్తుంటుంది. ఆమెను రాణా అనే పెద్దమనిషి బలవంతంగా అనుభవించాలనుకుంటాడు . అతన్ని ఎదుర్కునే క్రమంలో తలకు దెబ్బతగిలి చనిపోతాడు. ఆ తరువాత ఆమె తల్లి భయపడి సెహర్ ను ముంబైకి పంపిస్తుంది. అక్కడ ఆమె కామాఠీపుర అనే రెడ్-లైట్ ప్రాంతంలో చిక్కుకుంటుంది.అక్కడ అమ్మాయిలను వేలం వేసి మరీ అమ్ముతుంటారు. అక్కడే సెహర్ కూడా తన బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాంతంలో రెండు ప్రత్యర్థి అండర్‌వరల్డ్ గ్యాంగ్‌ల మధ్య ఆమె చిక్కుల్లో పడుతుంది. ఖాదీర్ అనే డాన్ కి వ్యతిరేకంగా పని చేస్తుంది. అక్కడ వీళ్ళ చేతికి చిక్కిన చంప అనే అమ్మాయిని కాపాడాలి అనుకుంటుంది. ఈ క్రమంలో ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. అమ్మాయిలని సప్లై చేసే ఒక వ్యక్తి తో ప్రేమలో పడుతుంది. మరోవైపు రాణా కొడుకులకు సెహర్ ఎక్కడుందో తెలిసిపోతుంది. వాళ్ళ తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి వీళ్ళు కూడా ముంబై వస్తారు. చివరికి సెహర్ సెక్స్ వర్కర్ గానే జీవితం మొదలుపెడుతుందా ? రాణా కొడుకులు ఆమె పై ప్రతీకారం తీర్చుకుంటారా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వెబ్ సిరీస్ ను చూడండి.