OTT Movie : ఇప్పుడు మలయాళం సినిమాలకు అభిమానులు ఎక్కువయ్యారు. ఓటిటిలో చాలా రోజుల నుంచి ఈ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఫహద్ ఫాసిల్ నటించిన ఒక మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. క్లైమాక్స్ ఊహించని రీతిలో మెస్మరైజ్ చేస్తుంది. చివరి వరకు కుర్చీలకు కట్టిపడేసే ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో
ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు ‘వరతన్’ (Varathan). దీనికి అమల్ నీరద్ దర్శకత్వం వహించారు. ఇందులో ఫహద్ ఫాసిల్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1971లో వచ్చిన హాలీవుడ్ చిత్రం “స్ట్రా డాగ్స్” (Straw Dogs) ఆధారంగా దీన్ని రూపొందించారు. నజ్రియా నజీమ్‌తో కలిసి ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్, అమల్ నీరద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మించారు. వరతన్ 20 సెప్టెంబర్ 2018న విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అబిన్, ప్రియ పెళ్లి చేసుకుని హ్యాపీ గా దుబాయ్‌లో జీవిస్తుంటారు. కొద్దిరోజుల్లోనే అబిన్ తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. మరోవైపు ప్రియకి కూడా గర్భస్రావం అవుతుంది. ఈ వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో వీళ్ళు ఒక కొత్త ప్రదేశానికి వెళ్లాలను అనుకుంటారు. ఆతర్వాత వారు కేరళలోని ప్రియ స్వస్థలంలో ఆమె ఫామ్‌హౌస్‌కి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ ఇల్లు కొండల్లో ఒక సుందరమైన ప్రదేశంలో ఉంటుంది. కానీ అక్కడ జన సంచారం అంతగాఉండదు. వారు గ్రామంలోకి అడుగుపెట్టినప్పటి నుండి, ప్రియ చిన్నతనంలో ఆ ఊళ్లోనే పెరిగినప్పటికీ, స్థానికులు వీరిని అవుట్‌సైడరర్స్ లాగే చూస్తారు. ప్రియను వాళ్ళు చూసే చూపుల్లో శత్రుత్వం కనబడుతూ ఉంటుంది. కొందరు మగవాళ్ళు ప్రియ పట్ల అసభ్యకరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆమెను నిరంతరం గమనిస్తూ ఉంటారు. అబిన్ మొదట్లో ఈ విషయాలను పెద్దగా పట్టించుకోడు. కానీ ప్రియ మాత్రం ఈ పరిస్థితులపై అప్రమత్తంగా ఉంటుంది.
స్టోరీ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ శత్రుత్వం ఎక్కువ అవుతుంది. ఒక రాత్రి అబిన్ ఇంట్లో లేనప్పుడు, కొందరు వ్యక్తులు ప్రియపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆమెపై బలాత్కారం కూడా చేయబోతారు. ఈ సంఘటన అబిన్‌లోని శాంతమైన స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ తర్వాత అతను తన భార్యను కాపాడుకోవడానికి ఒక ఉన్మాద రీతిలో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడతాడు. క్లైమాక్స్‌లో అబిన్ తన ఇంటిని ఒక యుద్ధభూమిగా మార్చి,శత్రువులకు వ్యతిరేకంగా తిరగబడతాడు. ఇది ఒక ఉత్కంఠభరితమైన పరిస్తితిగా మారుతుంది. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ నటన, అమల్ నీరద్ దర్శకత్వం,లిటిల్ స్వయంప్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ మలయాళ థ్రిల్లర్ మూవీకి ఒక మరపురాని అనుభూతిని తెచ్చి పెట్టాయి.