Psychological Horror Thriller on OTT: దెయ్యాలు, ఆత్మల చుట్టూ తిరిగే హారర్ సినిమాల కంటే.. మనుషుల్లోని క్రూరమైన ఆలోచనలు, వికృత ప్రయోగాల నేపథ్యంలో వచ్చే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్లే ప్రేక్షకులకు అసలైన భయాన్ని పరిచయం చేస్తుంటాయి. అలా ఒంటరిగా చూడటానికి ధైర్యం కావాలనేంత భయానకంగా రూపొంది లేటెస్ట్ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ‘బ్రీడర్’ (Breeder). 2026 జూన్‌లో థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీ వేదికగా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. డబ్బు ఆశ చూపి మనుషులతో చేయించిన ఆ వికృత ప్రయోగాలు చూస్తే ఎవ్వరైన వణికిపోతారు కూడా. ఈ సినిమా కథ ఏమిటి ? ఎక్కడ చూడవచ్చో అనే వివరాల్లోకి ..
ఇందులో అంతరించిపోతున్న తేనెటీగలను కాపాడాలనే గొప్ప ఆశయంతో రస్సెల్ అనే యువకుడు పరిశోధనలు చేస్తుంటాడు. ఆ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి అతనికి భారీగా నిధులు అవసరమవుతాయి. ఎక్కడెక్కడో డబ్బు కోసం ప్రయత్నిస్తున్న రస్సెల్‌కు, ప్యాటీ కోల్బ్ అనే ఒక సంపన్న మహిళ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. చూడటానికి కుక్కలను పెంచుకునే ఒక సాధారణ మహిళలా కనిపించే ప్యాటీ, రస్సెల్ పరిశోధనకు కావాల్సినంత ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి తన రాంచ్‌కు ఆహ్వానిస్తుంది.
ఆ ఆఫర్‌తో ఎంతో ఆశగా తన ప్రియురాలు హేలీని తీసుకుని రస్సెల్ ప్యాటీ ఉండే ఆ మారుమూల ప్రాంతానికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే వాళ్లకు చుట్టూ ఉన్న వాతావరణం చాలా వింతగా, భయంకరంగా అనిపిస్తుంది. ప్యాటీ కేవలం కుక్కల పెంపకం మాత్రమే కాకుండా, మనుషులపై కూడా అత్యంత వికృతమైన జన్యు ప్రయోగాలు చేస్తోందని రస్సెల్‌కు అర్థమవుతుంది. బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేని ఆ ప్రదేశంలో తాము ఒక పెద్ద ఉచ్చులో చిక్కుకున్నామని వాళ్లు గ్రహిస్తారు.
ప్యాటీ తన కూతుళ్లతో కలిసి నిర్వహిస్తున్న ఆ భయంకరమైన ప్రణాళికలో రస్సెల్‌ను కూడా ఒక పావుగా వాడుకోవాలని చూస్తుంది. చుట్టూ ఉన్న ప్రమాదం నుంచి తప్పించుకునే దారి లేక, ప్యాటీ కనుసన్నల్లో బందీలుగా మారిన రస్సెల్, హేలీ ప్రాణభయంతో పోరాడాల్సి వస్తుంది. మంచి ఉద్దేశంతో వెళ్లిన ఒక యువకుడు, ఆ మృత్యుకూపం నుంచి తనను, తన ప్రియురాలిని ఎలా కాపాడుకున్నాడనే ఉత్కంఠభరితమైన కథనంతో దర్శకుడు అలెక్స్ గోయెట్ ఈ సైకలాజికల్ హారర్ సినిమాను గగుర్పొడిచేలా తెరకెక్కించారు.
అలెక్స్ గోయెట్ (Alex Goyette) దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రీడర్’ (Breeder)లో డానియల్ డోహెనీ (Daniel Doheny), డాట్-మేరీ జోన్స్ (Dot-Marie Jones), మాడీ ఫిలిప్స్ (Maddie Phillips), తనయా బీటీ (Tanaya Beatty) ప్రధాన పాత్రలు పోషించారు. రొటెన్ టొమాటోస్‌లో ఏకంగా 87 శాతం, IMDbలో 6.7/10 రేటింగ్ సాధించిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచే (2026 నవంబర్ 24) ప్రైమ్ వీడియోలో రెంటల్ (Rent) విధానంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లీష్ (English) ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ సదుపాయంతో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్లు, డిస్టర్బింగ్ హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.