Mookuthi amman 2 movie:ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ . సి దర్శకత్వంలో నవంబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదలైన మూకుత్తి అమ్మన్ 2 ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. నయనతార (Nayanthara)అమ్మవారిగా, రెజీనా కసాండ్రా (Regina Cassandra) విలన్ గా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మహాశక్తి’ పేరిట విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధం అయ్యింది.
థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేకపోయినా ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా డిసెంబర్ 4వ తేదీన స్ట్రీమింగ్ కి రానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ ,మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఇటు ఓటీటీ లో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో నయనతార తో పాటు దునియా విజయ్ , రెజీనా కసాండ్రా, యోగి బాబు, ఊర్వశి , గరుడా రామ్, అభినయ, మైనానందిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించగా.. డాక్టర్ ఇషారి కే గణేష్ నిర్మించారు.
also read:ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్!
మహాశక్తి మూవీ స్టోరీ విషయానికి వస్తే.. గతంలో వచ్చిన మూకుత్తి అమ్మన్ అలియాస్ అమ్మోరు తల్లి మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ శక్తి ( నయనతార), తల్లి బాల (ఊర్వశి) తో కలిసి ఉంటుంది. రాత్రి అయితే చాలు శక్తికి పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉంటాయి. గుర్రాలు, కత్తులు సైన్యంతో పాటు “నీ సొంతూరు మైలాంజీకి రా” అని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు బయట ఉండగా కొందరు దుండగులు బాలికను కిడ్నాప్ చేసి, నరబలి ఇవ్వాలని ప్రయత్నిస్తారు. వారితో పోరాడి శక్తి ఆ పాపను కాపాడుతుంది. దీంతో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. ఇక అదే మీటింగ్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ తనకు మైలాంజి నుంచి సిటీకి ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతుంది. ఇది విన్న శక్తి ఆమె స్థానంలో తాను మైలాంజికి వెళ్తానని అడుగుతుంది.
మైలాంజికి వెళ్లిన శక్తికి ఊహించని ఘటనలు ఎదురవుతాయి.. అసలు మైలాంజికి , శక్తికి మధ్య సంబంధం ఏమిటి? ఎందుకు శక్తికి అలాంటి కలలు వస్తున్నాయి? రెండు వేల ఏళ్ల కిందట సమాధి చేసిన దుష్టశక్తి బైరా(రెజీనా) ను క్షుద్ర మాంత్రికుడు (సునీల్) ఎందుకు బతికించాడు? ఆమె ప్రియుడు (దునియా విజయ్) తో ఎందుకు కలిపాడు? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా స్టోరీ ఓటిటి ప్రియులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.