Mega Verse : మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా నెట్ ఫ్లిక్స్ లో మెగా వర్స్(Mega Verse) అనే టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే .ఈ విషయానికి సంబంధించి ఇదివరకే అధికారిక ప్రకటన వెలబడింది ఇకపోతే ఈ టాక్ షో గ్రాండ్ లాంచ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ టాక్ షో కి సంబంధించి ఒక ప్రోమో వీడియోని నెట్ ఫ్లిక్స్(netflix) విడుదల చేసింది. ఈ ప్రోమో వీడియోలో భాగంగా చిరంజీవికి సంబంధించిన ఫోటోలతో ఎంతో ఆసక్తిని కలిగించారు.
ఈ ప్రోమోలో భాగంగా ఇంగ్లీషులో ఉన్న చిరంజీవి పేరులో ‘CHIRA_JEEVI’ అని ఉంది. ఆ స్పెల్లింగ్ లో ‘N’ మిస్ అయింది. ఇప్పటికే ఈ పేరుతో ఎన్నో పోస్టర్లు బయటకు రావడంతో అసలు చిరంజీవి పేరులో ఎన్ ఎందుకు తొలగించారు అనే సందేహాలు అందరిలో కలిగాయి. అయితే చిరంజీవి పేరులో N ఎందుకు మిస్సయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు..మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు చూడబోతున్నారంటూ నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ వీడియో చివర్లో ‘CHIRA_JEEVI’ పేరులో మిస్ అయిన ‘N’ అక్షరాన్ని ‘NETFLIX’ అని స్వయంగా చిరంజీవి తెలియజేశారు.
ఇక ఈ ప్రోమో చివరిలో ఇది “నా అడ్డా” అంటూ చిరంజీవి చెప్పడం ఈ ప్రోమోకి హైలైట్ నిలిచింది. అదేవిధంగా ఈ కార్యక్రమం పై భారీగా అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయితే ఇక ఈ టాక్ షో ఎప్పుడు ప్రసారం అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అతి త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొనబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
?avpt=MTQzcWJmNnQwYjRoeg%3D%3D
ఈ టాక్ షోలో భాగంగా మొదటి ఎపిసోడ్ లో అక్కినేని నాగార్జున తన ఇద్దరు కుమారులతో కలిసి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో సందీప్ రెడ్డి నాని, రవితేజ, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎస్ఎస్ తమన్, ప్రభాస్ వంటి సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారని వీరికి సంబంధించిన ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తి అయిందని సమాచారం. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకు మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించిన చిరంజీవి ఇప్పుడు మెగావర్స్ అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ టాక్ షో ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బాబి డైరెక్షన్ లో కాకా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: పెద్ది సినిమా స్పెషల్ సాంగ్ వివాదం….. శృతిహాసన్ స్లిప్పర్ షాట్ సమాధానం!