OTT Movie : హారర్ సినిమాలను రెండు రకాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ చివరివరకూ టెన్షన్ పెట్టిస్తుంటాయి. మరికొన్ని కామెడీ జనర్ లో తెరకెక్కిస్తుంటారు. ఈ రెండు రకాల కంటెంట్ ను ప్రేక్షకులు ఇంట్రెస్టింగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కామెడీ జనర్లో తెరకెక్కింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా థియేటర్లలో అదరగొట్టి, ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. ఇది ఒక ఎన్నారై జంట ఇంట్లో జరిగే అతీంద్రియ శక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కన్నడ కామెడీ హారర్ మూవీ పేరు’చూ మంతర్’ (Choo Mantar). 2025లో విడుదలైన ఈ సినిమాకి నవనీత్ దర్శకత్వం వహించారు. దీనిని తరుణ్ స్టూడియోస్ బ్యానర్‌లో తరుణ్ శివప్ప నిర్మించారు. ఇందులో శరణ్, మేఘన గావోంకర్, అదితి ప్రభుదేవ, ప్రభు ముంద్కూర్, చిక్కన్న, రజనీ భరద్వాజ్ తదితరులు నటించారు. ఈ సినిమా హారర్ కామెడీని జనర్ లో తెరకెక్కింది. ఒక భయంకరమైన హాంటెడ్ హౌస్‌లో జరిగే పారానార్మల్ కార్యకలాపాల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. 2 గంటల 22 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.8/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ గౌతమ్ అలియాస్ డైనమో అనే పేరుగల పారానార్మల్ నిపుణుడి తో మొదలవుతుంది. అతను ‘Choo Mantar & Co’ అనే కంపెనీని నాడుపుతుంటాడు. ఇందులో అతని టీం ఆర్జే (చిక్కన్న), అకాంక్ష (అదితి ప్రభుదేవ), నకుల్ (కిరణ్ చంద్రశేఖర్) ఉంటారు. ఈ టీం నైనిటాల్‌లోని మోర్గాన్ హౌస్ అనే హాంటెడ్ మాన్షన్‌ను పరిశీలించడానికి వెళ్తుంది. ఇందులో ఒక దాచిన నిధి ఉందని ప్రచారంలో ఉంటుంది. ఈ ఇల్లు బ్రిటిష్ కాలంలో, జార్జ్ మోర్గాన్ అనే టాక్స్ కలెక్టర్‌కు చెందినది. అతను స్థానిక గ్రామస్తులను టాక్స్పేరుతో దోపిడీ చేసేవాడు.
కథ రెండు టైమ్‌లైన్‌లలో జరుగుతుంది. ఒకటి గౌతమ్ (డైనమో) అతని బృందం 2024లో మోర్గాన్ హౌస్‌లోకి ప్రవేశించడం. మరొకటి బ్రిటిష్ కాలంలో జార్జ్ మోర్గాన్ చరిత్ర. ఇప్పుడు గౌతమ్ బృందం నిధి కోసం వెతుకుతున్నప్పుడు, వాళ్ళ ఊహించని సూపర్‌నాచురల్ సంఘటనలను ఎదుర్కొంటారు. ఇంట్లోకి ఒకసారి అడుగుపెట్టిన వాళ్ళు తిరిగి బయటకు రాలేరనే శాపం ఉందని తెలుసుకుంటారు. అదే సమయంలో, ఒక ఎన్‌ఆర్‌ఐ కుటుంబం ఈ ఇంటిని వారసత్వంగా పొంది అక్కడికి వస్తుంది. కానీ వాళ్ళ బిడ్డ వింతగా ప్రవర్తించడంతో వాళ్ళు కూడా పారానార్మల్ యాక్టివిటీని ఎదుర్కొంటారు.
మోర్గాన్ హౌస్‌లో జరిగే వింత సంఘటనలు, గౌతమ్ బృందాన్ని భయాందోళనకు గురిచేస్తాయి. ఇంటర్వెల్ వద్ద ఒక ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇది కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. కథ ముందుకు సాగేకొద్దీ, గౌతమ్ తండ్రి కూడా ఒకప్పుడు ఈ ఇంటి రహస్యాలను తెలుసుకోవడాని ప్రయత్నించిన పారానార్మల్ నిపుణుడని తెలుస్తుంది. కానీ అప్పుడు అతను దీనిని పూర్తి చేయలేకపోతాడు. గౌతమ్ తన తండ్రి మిషన్‌ను పూర్తి చేయడానికి, ఇంటిలోని దెయ్యం చరిత్రను, నిధి రహస్యాన్ని కనిపెట్టడానికి పోరాడతాడు. చివరికి ఆ ఇంట్లో ఉన్న దెయ్యం ఎవరు ? గౌతమ్ నిధిని కనిపెడతాడా ? ఆ ఇంట్లో నుంచి వీళ్ళంతా బయట పడతారా ? జార్జ్ మోర్గాన్ స్టోరీ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను, ఈ కన్నడ కామెడీ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : 6 ముఖాలతో పుట్టిన అబ్బాయి… వరుసగా అమ్మాయిల మిస్సింగ్… లింక్ ఏంటి?