South Central Railway Special Trains: జూన్ చివరి వారం నుంచి జూలై మధ్య వరకు రైల్వే ప్రయాణాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, కొన్ని రూట్లలో రద్దీకి అట్టుడికిపోవడం తలంపులోకి తీసుకొని.. South Central Railway ప్రయాణికులకు మంచి కబురు చెప్పింది. ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి మళ్లీ తన మార్కే పెట్టింది అదే స్పెషల్ ట్రైన్స్.
ఈసారి రెండు కీలక మార్గాల్లో.. ఒకటి తిరుపతి.. మదనపల్లి, మరొకటి సికింద్రాబాద్ – నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో ఒక మార్గం పూర్తిగా అన్ రిజర్వ్డ్ డైలీ సర్వీసులుగా, మరొకటి వారానికొకసారి రిజర్వేషన్ ఆధారిత సర్వీసులుగా ఉంటుంది. తిరుపతి – మదనపల్లి వరకు రోజూ వచ్చే భక్తులు, విద్యార్థులకు స్పెషల్ వెసులుబాటుగా భావించవచ్చు.
తిరుమల దర్శనం ముగించుకుని మదనపల్లి వైపు వెళ్లే వారికీ, తిరిగి తిరుపతికి చేరాల్సిన విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులకీ ఇది నిజంగా బోనస్ ట్రైన్‌లా మారనుంది. జూన్ 25 నుంచి జూలై 31, 2025 వరకు ఈ రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
ట్రైన్ నంబర్ 07261: తిరుపతి – మదనపల్లి.. ఉదయం 5:15 కు బయలుదేరిచి, 8:15కి చేరుకుంటుంది
ట్రైన్ నంబర్ 07262: మదనపల్లి – తిరుపతి.. మధ్యాహ్నం 3:00కు బయలుదేరి, సాయంత్రం 6:00కి చేరుతుంది
ఈ రెండూ జనరల్ ట్రైన్స్, అంటే టికెట్ తీసుకొని నేరుగా ఎక్కవచ్చు. రిజర్వేషన్ అవసరం లేదు. వేసవి సెలవుల తర్వాత ఆలయ సందర్శనలతో పాటు విద్యాసంస్థల రీఓపెనింగ్ టైమ్ కూడా కావడంతో ఈ ట్రైన్లు అద్భుతమైన సౌలభ్యంగా మారనున్నాయి. సికింద్రాబాద్ – నాగర్‌సోల్ వరకు వారానికి ఒకసారి.. కానీ సంపూర్ణ సౌకర్యంతో తెలంగాణ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే ప్రయాణికుల రద్దీ కూడా తారాస్థాయిలో ఉంటుంది. అందుకే SCR జూలై 3 నుంచి జూలై 25 వరకూ ఈ మార్గంలో 8 స్పెషల్ సర్వీసులు నడపనుంది.
ట్రైన్ నంబర్ 07001: సికింద్రాబాద్ – నాగర్‌సోల్.. గురువారం రాత్రి 9:20కి బయలుదేరి, తరువాతి రోజు ఉదయం 9:45కి చేరుకుంటుంది.
ట్రైన్ నంబర్ 07002: నాగర్‌సోల్ – సికింద్రాబాద్.. శుక్రవారం సాయంత్రం 5:30కి బయలుదేరి, తరువాతి రోజు ఉదయం 7:30కి చేరుతుంది.
Also Read: Vande Bharat Train: ఈ రూట్‌లో వందే భారత్.. ఫస్ట్ టైమ్ వస్తోంది.. ఇక అక్కడ నో వెయిటింగ్!
ఈ ట్రైన్లు ఈ దిగువ స్టేషన్లలో ఆగుతాయి
మల్కాజిగిరి, బోలారం, మెడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ముడ్కేడ్, నాందేడ్, పూర్ణా, పరభణి, జల్నా, ఔరంగాబాద్. అంతేకాదు, ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC కోచ్‌లు ఉంటాయి. అంటే దీర్ఘ దూర ప్రయాణం చేయాల్సిన వారికి సౌకర్యవంతమైన ఆప్షన్.
SCRకి ప్రత్యేక అభినందనలు చెప్పాల్సిందే!
కేవలం సాధారణ ప్రయాణికుల కోసం కాకుండా, విద్యార్థులు, ఉద్యోగులు, భక్తులు, వ్యాపారవేత్తలు.. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ చేసింది SCR. ఏ ప్రాంతానికైనా సమయానికి వెళ్లే మార్గాలు దొరకటం విశేషం. ప్రత్యేకంగా రిజర్వేషన్ అవసరం లేని అనరిజర్వ్డ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం. అందరికీ టికెట్లు దొరకడం లేదు, వెయిటింగ్‌కి బెదిరిపోతున్నారన్న సమయంలో ఇలా స్పెషల్ ట్రైన్‌లు రాకపోతే పరిస్థితి మరింత కష్టమే. అందుకే, ఈ టైమ్‌కి ముందుగానే ప్రణాళిక ప్రకారం టికెట్ బుక్ చేసుకుంటే మంచిది.
ఈ వేసవిలో లేదా జూలై మాసంలో మీరు తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? లేక మహారాష్ట్ర వైపు వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇదే బస్ కాదు.. ట్రైన్ టైమ్. SCR తీసుకొచ్చిన ఈ రెండు స్పెషల్ ట్రైన్ సర్వీసులు మీ ప్రయాణాన్ని తేలికగా, సమయోచితంగా, హాసలతో మలుస్తాయి. ఈ గమనాన్ని మిస్ కావొద్దు!