Ayesha Khan Death: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు వరుసగా మరణిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్ (Pakistan) కి చెందిన నటి అయేషా(Ayesha) (76) మరణించారని తెలుస్తుంది. ఈమె మరణించిన వారం రోజుల తర్వాత తన మరణ వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈమె శరీరం పూర్తిగా కుళ్ళిన స్థితిలో ఉందని తెలుస్తుంది. పాకిస్తాన్ కి చెందిన ఆయేషా నవంబర్ 22, 1948న జన్మించారు. ఈమె టెలివిజన్(Television) రంగంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.. అఖ్రీ చట్టాన్, టిప్పు సుల్తాన్: ది టైగర్ లార్డ్, డెహ్లీజ్, దారారెయిన్, బోల్ మేరీ మచ్లీ వంటి ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు.
టెలివిజన్ రంగంలో గుర్తింపు…
ఇలా బుల్లితెరపై మాత్రమే కాకుండా ఆయేషా వెండితెర సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు. వెండితెరపై ఈమె ముస్కాన్, ఫాతిమా వంటి అనేక పాకిస్తానీ చిత్రాలలో నటించారు. అదేవిధంగా బాలీవుడ్ సినిమాలైనా రాజు బన్ గయా జెంటిల్‌మన్ సినిమాలో కూడా నటించి సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సేవలు చేసిన ఈమె మరణ వార్త అందరిని ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.
కుళ్ళిన స్థితిలో మృతదేహం…
అయేషా వయసు పై పడటంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే కరాచీలో(Karachi) నివసిస్తున్నటువంటి ఈమె తన అపార్ట్మెంట్ లోనే మరణించారు. ఈమె మరణించిన కొద్ది రోజుల తర్వాత తన అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన వస్తున్న నేపథ్యంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అపార్ట్మెంట్ లోకి వెళ్ళగా ఆమె మరణించి పూర్తిగా కుళ్లిపోయే స్థితిలో తన మృతదేహం ఉందని తెలిపారు. ఇక ఈమె మరణానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. సహజంగానే మరణించారా ?మరి ఏదైనా కారణం ఉందా ?అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయేషా మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు.
ఒంటరి జీవితం…
ఇలా పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆయేషా మృతదేహాన్ని సోహ్రాబ్ గోత్‌లోని ఎధి ఫౌండేషన్ మార్చురీకి తరలించారు. ఈమె మరణానికి గల కారణాలు ఏంటి అని పూర్తి వివరాలు తెలిసిన తర్వాతనే తన మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తిరిగి ఇవ్వనున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా ఈమె ఒంటరిగా గడుపుతున్నారని తెలుస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇలా అనారోగ్య సమస్యల కారణంగానే మరణించారా? ఈమె మరణానికి మరేదైనా కారణం ఉందా అనే విషయాలను తెలుసుకోవడం కోసం పోలీసులు కూడా దర్యాప్తున ప్రారంభించారు. నటి అయేషా మరణ వార్త పాకిస్తాన్ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈమె మరణ వార్త తెలియగానే ఎంతోమంది అభిమానులు పాకిస్తాన్ సినీ సెలబ్రిటీలు ఈమె మరణ వార్త స్పందిస్తూ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక ఆయేషా సోదరి రియాసత్, పాకిస్తానీ టెలివిజన్‌లో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. అయితే ఈమె కూడా గత కొంతకాలం మరణించారు.
Also Read: Ananya Nagalla: తెలుగు అమ్మాయిలను తొక్కేస్తున్నారు.. టాలీవుడ్‌పై అనన్య నాగళ్ల ఆగ్రహం