Madhapur Car Accident: ఆగస్టు 16.. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర కారు ఢీకొని 26 ఏళ్ల భారతి చనిపోయింది. ఈ కేసులో జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ పై BNS 106 – 1 కింద కేసు నమోదైంది. పోలీసులు ఇది బెయిలబుల్ కేసు కావడంతో అరెస్ట్ చేయలేదని చెప్పారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్నలేంటంటే… ప్రమాదం జరిగిన సమయంలో కారు స్పీడ్ ఎంత? CCTV ఫుటేజ్ లో ఏం ఉంది? FIRలో వివరాలపై ఎందుకు డౌట్లు వచ్చాయ్? పోలీసులు చెబుతున్న దర్యాప్తు పురోగతి ప్రజలకు పూర్తిగా ఎందుకు తెలియడం లేదన్నది కీలకంగా మారుతోంది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఒకరి మృతికి కారణమైన కేసులో సంజూష్ ను ఇప్పటిదాకా విచారించకపోవడం ఏంటన్న ప్రశ్నలైతే వస్తున్నాయి. చట్టం అందరికీ సమానమైతే.. దర్యాప్తులోనూ అదే వేగం, అదే పారదర్శకత కనిపించాలి కదా? అటు తన కుటుంబానికి అన్నీ ఆధారమైన యువతి చనిపోవడంతో వాళ్లకు న్యాయం ఎవరు చేస్తారు.. ఎప్పుడు చేస్తారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.