E-Paper
Advertisement

ఇరుముడి సక్సెస్  పెరిగిన కొమరక్క రెమ్యూనరేషన్.. ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

ఇరుముడి సక్సెస్  పెరిగిన కొమరక్క రెమ్యూనరేషన్.. ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?
Advertisement

Jabardasth komarakka: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది సినిమాలలో అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకొని సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్న వారిలో కొమరక్క అలియాస్ కొమరం (Komaram)ఒకరు. తాజాగా ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవాని శంకర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఇరుముడి(Irumudi) సినిమాలో విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగులు అనే నెగిటివ్ క్యారెక్టర్ లో కొమరం నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.

హోటల్ లో పని చేసిన కొమరక్క..

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో కొమరం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్న సందడి చేస్తున్నారు .ఈ నేపథ్యంలోనే తన వృత్తిపరమైన విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కొమరం తన మొదటి సంపాదన గురించి కీలక విషయాలు వెల్లడించారు. తాను మొట్టమొదటిసారి హైదరాబాదులోని మోండా మార్కెట్ క్లాక్ టవర్ ఎదురుగా సుధా టిఫిన్ సెంటర్ అనే చిన్న హోటల్ ఉండేది. తాను మొదటిసారి అక్కడ పని చేశానని కొమరం తెలిపారు. అక్కడ క్లీనర్ గా పనిచేసేవాడినని అప్పుడు రోజుకు తాను 15 రూపాయలు జీతం తీసుకునే వాడిని అంటూ ఈయన తన మొదటి సంపాదన గురించి తెలియజేశారు.

నెలకు 750 రూపాయల జీతం..

Advertisement

ఈ హోటల్లో మానేసిన తర్వాత తాను కోఠి కామత్ లో పని చేశానని, అక్కడ నెలకు 750 రూపాయలు జీతం తీసుకునే వాడిని అంటూ ఈయన తన మొదటి సంపాదన గురించి తెలిపారు. ఇలా 15 రూపాయలతో మొదలైన ఈయన ప్రయాణం నేడు రోజుకు వేల రూపాయలు సంపాదిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈయన నటించిన ఇరుముడి సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి కూడా తెలిపారు. ఈ సినిమా కోసం తాను 16 రోజులపాటు పనిచేశానని, రోజుకు 60 వేల రూపాయలు చొప్పున జీతం తీసుకున్నట్లు కొమరం వెల్లడించారు. ఇలా రోజుకు 60 రూపాయలు చొప్పున 16 రోజులకు గాను ఈయన 9.6 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఒక్క రోజుకు లక్ష రూపాయలు…

ఇక ఇరుముడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి సక్సెస్ కావడంతో కొమరం పాత్రకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. దీంతో ఈయన తదుపరి పాన్ ఇండియా స్థాయిలో సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈయన రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెరుగుతుందని రోజుకు లక్ష రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం కొమరం వేణు దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని తెలియచేశారు.

Advertisement

Also Read: నా బిడ్డకు మీరే పేరు పెట్టండి… ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన సమంత!

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×