OTT Movie : వాలెరీ ఒక విజయవంతమైన మోటివేషనల్ స్పీకర్. తన జీవితాన్ని పూర్తిగా తన కంట్రోల్ లో ఉంచుకుంటుంది. కానీ ఆమె తల వెనుక భాగంలో ఒక తీవ్రమైన దురద ప్రారంభమవుతుంది. అది ఎంత గోకినా తగ్గదు. ఆమె ఒక అంతర్జాతీయ టూర్‌కు సిద్ధమవుతున్న సమయంలో, ఈ దురద ఒక భయంకరమైన శక్తిగా మారుతుంది. ఈ క్రమంలో ఆమె చాలా సమస్యలను ఎదుర్కుంటుంది. ఆమె తల్లి మరణం గురించిన రహస్యం, సాన్షి అనే దెయ్యం గురించి ఆమె తండ్రి చెప్పిన ఒక పురాతన కథ ఆమె జీవితాన్ని కలవరపెడుతాయి. ఈ దురద కేవలం ఒక శారీరక సమస్యా, లేక ఆమె కుటుంబంలో దాగి ఉన్న ఒక శాపమా? వాల్ ఈ భయంకర శక్తిని అధిగమించగలదా ? ఈ సినిమా పేరు ఏంటి ? ఎందులో ఉంది అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ వాలెరీ అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక అమెరికన్ మోటివేషనల్ స్పీకర్. సైకాలజీ సెమినార్‌లతో సెలెబ్రిటీ స్టేటస్‌ను సాధించింది. ఆమె జీవితం బయటి నుండి పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. విశాలమైన ఇల్లు, సపోర్టివ్ హస్బెండ్ రాబీ, ఒక అంతర్జాతీయ టూర్ కూడా సిద్ధంగా ఉంది. అయితే వాల్ తీవ్రమైన ఆందోళనలో ఉంటుంది. ఆమె బాల్యంలో ఒక బోటింగ్ యాక్సిడెంట్‌లో ఆమె తల్లి మరణం గురించి బాధపడుతుంటుంది. ఈ సమయంలో ఈమె ఒక వింత దురద వస్తుంది. ఆమె తల వెనుక భాగంలో గోకడం ఆపలేని కంపల్షన్‌గా మారుతుంది. ఈ దురద ఆమె టూర్ సన్నాహాల సమయంలో తీవ్రమవుతుంది, ఆమె దానిని గోకడం వల్ల రక్తం కారి బాగా గాయం ఏర్పడుతుంది. దీనిని ఆమె టోపీలతో కప్పిపుచ్చుతుంది. ఆమె జీవితంలో నియంత్రణ కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. ఆమె భర్త రాబీ ఆమె ప్రవర్తన గురించి ఆందోళన చెందుతాడు. వాల్‌కు తన బర్త్ సర్టిఫికేట్ అవసరం కావడంతో, ఆమె తన విడిపోయిన కుటుంబంతో మళ్లీ కనెక్ట్ అవుతుంది. ఆమె అత్త థూయ్ ఆమెను ఆమె తండ్రి సాంగ్ వద్దకు పంపుతుంది. అతను వియత్నాం యుద్ధంలో సైనికుడిగా ఉండేవాడు. ఇప్పుడు బౌద్ధ సన్యాసిగా, మాదకద్రవ్యాల వ్యసనం నుండి కోలుకున్నాడు.
సాంగ్‌తో ఆమె సంబంధం తల్లి మరణం కారణంగా దూరం పెరుగుతుంది. సాంగ్ వాల్‌కు సాన్షి గురించి చెబుతాడు. ఈ పరానాయిడ్ దెయ్యం మానవ హోస్ట్‌లపై ఆధారపడి, వారిని వినాశకరమైన కంపల్షన్స్‌కు గురిచేస్తుంది. ఈ సాన్షి వాల్ కుటుంబంతో ముడిపడి ఉందని, ఆమె తల్లి చి కూడా ఇలాంటి లక్షణాలతో బాధపడిందని అతను తెలియజేస్తాడు. వాల్ ఈ కథను మొదట మూఢనమ్మకంగా భావిస్తుంది. కానీ ఆమె తల్లి ఫోటోలలో రహస్యమైన రాషెస్‌ను కనిపెట్టి, ఇది కుటుంబ శాపంగా సందేహిస్తుంది. ఈ క్రమంలో ఆమె దురద కూడా తీవ్రమవుతుంది. ఆమె తలలో రంధ్రం ఏర్పడే వరకు గోకుతుంది. ఆమె హాలుసినేషన్స్ తో మరింత టార్చర్ అనుభవిస్తుంది. వాల్ పరిస్థితి ఆమె వ్యక్తిగత ప్రొఫెషనల్ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆమె ఒక స్పీకింగ్ ఈవెంట్‌లో బ్రేక్‌డౌన్ అవుతుంది. హాస్పిటల్ లో జాయిన్ అవుతుంది. డాక్టర్లు ఆమె స్కల్‌లో రంధ్రం గుర్తించి షాక్ అవుతారు. చివరికి వాల్ పరిస్థితి ఏమౌతుంది ? ఆమెకు ఇలా ఎందుకు జరుగుతోంది ?దీని వెనుక దుష్ట శక్తి ఉందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను చూడాల్సిందే.
ఈ సినిమా ఎందులో ఉందంటే
ఈ సూపర్ న్యాచురల్ హారర్ మూవీ పేరు ‘కంట్రోల్ ఫ్రీక్’ (Control Freak). 2025 లో వచ్చిన ఈ సినిమాకి శాల్ న్గొ దర్శకత్వం వహించారు. ఒక గంట 44 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 4.5/10 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ సినిమా హులు (Hulu) ఓటీటీలో అందుబాటులో ఉంది.